Oppo Smart TV : టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ వస్తువులనున్బాగా ఉపయోగిస్తూ ఉన్నారు. అందరూ ఎక్కువగా స్మార్ట్ మొబైల్స్, స్మార్ట్ వాచెస్, స్మార్ట్ టీవీలు ఇలా అన్నిటిని కూడా స్మార్ట్ గా వుండాలనే ఎక్కువగా ఆలోచిస్తున్నారు.. అది కూడా తక్కువ ధరలు కలిగిన వాటిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందుచేతనే పలు కంపెనీలు కూడా వీటిని ఎక్కువగా ఫాలో అవుతున్నాయి. కరోనా సమయంలో ప్రజలు టీవీలకు , స్మార్ట్ ఫోన్ లకు ఎక్కువ మక్కువ చూపించారు ఈ నేపథ్యంలోని కంపెనీలు టీవీల పైన బాగా దృష్టిని పెట్టాయి. తక్కువ ధరలో స్మార్ట్ టీవీలను లాంచ్ చేస్తూ వినియోగదారులకు బాగా ఆకట్టుకునే పనిలో పడ్డాయి. తాజాగా ప్రముఖ టెక్ సంస్థ అయినా ఒప్పో తక్కువ బడ్జెట్ లో 50 ఇంచుల స్మార్ట్ టీవీ ని లాంచ్ చేసింది. వాటి గురించి చూద్దాం.
2020 లో ఒప్పో 65 ఇంచుల స్మార్ట్ టీవీని విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసినదే. దీని ధర రూ.50 వేల వరకు ఉంటుంది. అందుచేతనే ధర ఎక్కువగా ఉండడం వల్ల సామాన్యులను అట్రాక్ట్ చేయలేక పోయింది. అందుచేతనే ఈసారి మాత్రం తక్కువ ధరలోనే 50 ఇంచుల స్మార్ట్ టీవీ ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఒప్పో k -x పేరుతో ఒక స్మార్ట్ టీవీ ని తీసుకువచ్చింది. ఈ స్మార్ట్ టీవీ ప్రస్తుతానికి చైనాలో మాత్రమే విడుదలయ్యింది. దీని ద్వారా చైనా కరెన్సీ ప్రకారం..1399 యువాన్లుగా తెలుస్తోంది. అంటే మన కరెన్సీ ప్రకారం రూ.16,500 నిర్ణయించింది. అయితే ఇందులో డిస్కౌంట్ కూడా ఉన్నట్లుగా తెలియజేశారు. ఈ స్మార్ట్ టీవీ ని మనం కొనాలి అంటే ఒప్పో అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయాలి.
ఫీచర్స్ : ఈ స్మార్ట్ టీవీ 2 GB+16 GB మెమొరీ స్టోరేజ్ కలదు. ఇక ఈ స్మార్ట్ టీవీ బ్రైట్నెస్ 280నిట్స్, 20 వాట్ పవర్ రేటింగ్ తో పాటు రెండు ఇంటిగ్రేటెడ్ స్పీకర్లు కూడా కలవు. వైర్లెస్ కలెక్షన్స్ కోసం డ్యూయల్ బ్రాండ్ వైఫై సపోర్ట్ కూడా కలదు. అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీ మన కళ్ళ పైన ఒత్తిడిని తగ్గించడానికి..10.7 రంగులతో పాటు బ్లూ లైట్ తగ్గించే టెక్నాలజీ కూడా కలదు. ఇక మార్కెట్లోకి అతి తక్కువ ధరకే ఈ స్మార్ట్ టీవీ విడుదలయితే పెద్ద సంచలనం సృష్టిస్తుందని మార్కెట్ నిపుణులు తెలియజేస్తున్నారు.