OnePlus Smart TV : ప్రముఖ టెక్ దిగ్గజం అయినటువంటి వన్ ప్లస్ కేవలం స్మార్ట్ ఫోన్లను మాత్రమే కాదు అత్యంత క్వాలిటీతో కలిగిన స్మార్ట్ టీవీలను కూడా ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వన్ ప్లస్ నుంచి ఎన్నో రకాల స్మార్ట్ టీవీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక ఈ నేపథ్యంలోనే వన్ ప్లస్ స్మార్ట్ టీవీ రూ.30 వేలకు పైగా ఉండడంతో సామాన్య ప్రజలు కొనుగోలు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఇక 43 ఇంచుల స్మార్ట్ టీవీ పై ఏకంగా రూ.10,000 డిస్కౌంట్తో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ఈ హాట్ డీల్ కొద్దిరోజుల వరకే ఉంటుంది అని స్పష్టం చేశారు. ఇకపోతే వన్ ప్లస్ నుంచి వస్తున్న ఆ స్మార్ట్ టీవీ ధరలు అలాగే ఫీచర్స్ అన్నీ కూడా ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
One Plus Y1S 43 ఇంచెస్ ఫుల్ హెచ్డి ఎల్ఈడి స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ.. మీకు ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది .అంతేకాదు ఈ స్మార్ట్ టీవీ బెజెల్ లెస్ ఫ్రేమ్ ను కలిగి ఉండడం గమనార్హం. 43 అంగుళాల డిస్ప్లే తో 1920 X1080 పిక్సెల్ రెజల్యూషన్ తో ఈ స్మార్ట్ టీవీ వస్తుంది . 60 Hz రిఫ్రెష్ రేటుతో అందుబాటులో ఉండే ఈ స్మార్ట్ టీవీ 20 వ్యాట్ సౌండ్ అవుట్ పుట్ ని కూడా అందిస్తుంది. ఇక అలాగే గూగుల్ అసిస్టెంట్, గూగుల్ క్రోమ్ కాస్ట్ ఇన్ బుల్ట్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇక సపోర్టెడ్ యాప్స్ విషయానికి వస్తే నెట్ ఫ్లెక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, యూట్యూబ్ వంటి ఓటీటీ యాప్స్ ని కూడా సపోర్ట్ చేస్తుంది.
ఇక ఈ స్మార్ట్ టీవీ యొక్క ధర విషయానికి వస్తే.. 43 అంగుళాలు కలిగిన ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ.31,999.. కానీ మీరు దీనిని ఫ్లిప్ కార్ట్ ద్వారా కేవలం రూ. 23,999 కే సొంతం చేసుకోవచ్చు. అంతే కాదు ఎస్బిఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసినట్లయితే 2000 రూపాయల వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ స్మార్ట్ టీవీ పై రూ.10,000 డిస్కౌంట్ తో మీకు కేవలం రూ.21,999 కే లభించడం గమనార్హం. అయితే ఆఫర్ ఫ్లిప్కార్ట్ లో కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. త్వరగా కొనుగోలు చేస్తే డబ్బు కూడా ఆదా అవుతుంది.