OnePlus : ప్రముఖ టెక్ దిగ్గజం అయినటువంటి వన్ ప్లస్ కస్టమర్లను ఆకర్షించడానికి తక్కువ ధరకే స్మార్ట్ ఫీచర్లతో కలిగిన స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇకపోతే వన్ ప్లస్ కార్యకలాపాలను క్రమం తప్పకుండా అనుసరించే వారికి వన్ ప్లస్ గురించి బాగా తెలిసే ఉంటుంది.. అంటే లేటెస్ట్ గా ఎలాంటి మోడల్ లాంచ్ చేశారు? తదుపరి ఏ స్మార్ట్ ఫోన్ వస్తుంది ? అందులో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి? ఇక పాత మోడల్ పై ఏవైనా ధర తగ్గింపులు ప్రకటించారా? ఇలా మొదలైన విషయాలను తెలుసుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. ఇప్పుడు కంపెనీ ఇటీవల వన్ ప్లస్ 10T 5G నీ లాంచ్ చేసిందని ప్రతి ఒక్కరికి తెలిసిందే.
ఇక ఈ క్రమంలోనే వన్ ప్లస్ 9 ప్రో స్మార్ట్ ఫోన్ ధర కూడా తగ్గించింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇప్పుడు మూడవసారి ధర తగ్గించి కస్టమర్లను మరింతగా ఆకర్షిస్తుంది. ముచ్చటగా మూడోసారి వన్ ప్లస్ 9 ప్రో స్మార్ట్ ఫోన్ ధర రూ.4,200 కి తగ్గింది. ఇక ఆసక్తికరంగా ఈ ధర తగ్గింపు వన్ ప్లస్ నైన్ ప్రో యొక్క రెండు స్టోరేజ్ ఎంపికలలో కూడా అందుబాటులో ఉండడం గమనార్హం. ఇక తాజాగా తగ్గింపు ధరల తర్వాత చూసుకున్నట్లయితే వన్ ప్లస్ 9ప్రో 8GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.49,999. ఇక రెండవ వేరియంట్ 12GB ర్యామ్ + 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.54,999.
ఇక కలర్స్ విషయానికి వస్తే . స్టెల్లార్ బ్లాక్ , ఫైన్ గ్రీన్, మార్నింగ్ మూడ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కెమెరా విషయానికి వస్తే రియల్ క్వాడ్ కెమెరా.. 48 మెగాపిక్సల్ ప్రధాన కెమెరాతో పాటు 15 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 8 మెగాపిక్సల్ టెలిఫోటో లెన్స్ అలాగే 2 మెగాపిక్సల్ మోనోక్రోమ్ లెన్స్ అమర్చబడి ఉన్నాయి. ఇక సెల్ఫీ కోసం 16MP ఫ్రంట్ కెమెరాని కూడా అమర్చబడింది..65W వైర్డ్ చార్జింగ్ సపోర్టు అలాగే 50W వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ను కూడా అందిస్తుంది.4500 MAh బ్యాటరీ ని కలిగి ఉంటుంది. ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ లెవెన్ ఆధారితంగా పనిచేస్తుంది.6.7 ఇంచెస్ ఫ్లూయిడ్ అమొలెడ్ డిస్ప్లేను కలిగి ఉండడమే కాకుండా 120 Hz రీఫ్రెష్ రేట్ ను కలిగి ఉంటుంది.