One Plus 10R Prime Blue : వన్ ప్లస్ నుంచి మరో వండర్ఫుల్ ఫోన్.. ఫీచర్స్ తెలిస్తే అధుర్స్..!

One Plus 10R Prime Blue : ప్రస్తుతం వన్ ప్లస్ కంపెనీ విస్తృతంగా కస్టమర్లను ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. ఇప్పుడు ఎన్నో రకాల ఫీచర్లతో అందుబాటులోకి వచ్చే ఫోన్ లపై యూజర్లు కూడా ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో వన్ ప్లస్ కాస్త ఒక అడుగు ముందుకు వేసింది. వారి అభిరుచులను దృష్టిలో పెట్టుకొని వారికి తగ్గట్టుగా ఫీచర్స్ ని కూడా అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇకపోతే భారత మార్కెట్లో వన్ ప్లస్ 10 R ప్రైమ్ బ్లూ స్మార్ట్ ఫోన్ విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది వన్ ప్లస్. ఇక పొతే అమేజాన్ లో మాత్రమే మీరు ఈ ఫోను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇకపోతే వన్ ప్లస్ అలాగే అమెజాన్ ల మధ్య వున్న సుదీర్ఘ బంధం కారణంగా ఈ ఫోన్ ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది వన్ ప్లస్.

ముఖ్యంగా వన్ ప్లస్ .. అమెజాన్ నిర్వహిస్తున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో భాగం కావాలని ఉద్దేశంతోనే ఈ స్మార్ట్ ఫోన్ ప్రవేశపెట్టినట్లు సమాచారం. One plus 10R Prime Blue.. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే వారికి 3 నెలల పాటు ఉచితంగా అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ను పొందవచ్చు. అంతేకాదు ఫోన్ విడుదల తేదీపై ఇంకా స్పష్టత ఇవ్వకపోయినప్పటికీ ఆమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో విడుదల చేసి అవకాశాలు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే సెప్టెంబర్ 23 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ ఫెస్టివల్ సేల్ లో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

OnePlus 10 R Prime Blue Smartphone Released
OnePlus 10 R Prime Blue Smartphone Released

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే .. 80 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000 mah బ్యాటరీని పొందవచ్చు. 8GB ర్యామ్+ 128 GB స్టోరేజ్ విషయానికి వస్తే ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.34,999.. ఇక 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ విషయానికి వస్తే రూ.38,999. ఇక ట్రిపుల్ రియల్ కెమెరా సెట్ అప్ తో 50 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా, 8మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరాతో పాటు 2 ఎంపీ మైక్రో షూటర్ కూడా ఉన్నాయి. 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా అమర్చబడ్డారు.