OnePlus U1S 50 TV : కళ్ళు చెదిరే ఫీచర్స్ తో వన్ ప్లస్ U1S 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ..!!

OnePlus U1S 50 TV : స్మార్ట్ టీవీ కొనాలని అనుకుంటున్నారా? ముందుగా ఆ స్మార్ట్ టీవీ సైజు ఎంత ? దాని ఫీచర్స్ ఏమిటి ? ఎలా మనకు వినోదాన్ని పంచుతుంది? ధర ఎంత ? అందులో ఉండే స్పెసిఫికేషన్స్ ఏమిటి? ఇలా ప్రతి విషయాన్ని కూడా ముందుగా తెలుసుకోవాలి.. అప్పుడే ఎలాంటి స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేయాలో సులభంగా మీకు అర్థమవుతుంది. ఇక మీరు ఒక అద్భుతమైన అన్ని ఫీచర్స్ తో కూడిన స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేయాలనుకుంటే ప్రముఖ టెక్ బ్రాండ్ వన్ ప్లస్ మీకోసం ఒక అద్భుతమైన టీవీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక ఈ స్మార్ట్ టీవీ మీకు మంచి వినోదాన్ని అందించడమే కాకుండా 4కె పిక్చర్ క్వాలిటీ అందిస్తుందని చెప్పవచ్చు.

మరి టెక్ దిగ్గజం వన్ ప్లస్ అందిస్తున్న స్మార్ట్ టీవీ విషయానికి వస్తే.. వన్ ప్లస్ U1S 50 ఇంచెస్ అల్ట్రా హెచ్డి ఎల్ఈడి స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ.. నిజానికి మార్కెట్ ధర రూ.49,999.. కానీ ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజమైన ఫ్లిప్కార్ట్ నుంచి 28% డిస్కౌంట్ తో ఈ స్మార్ట్ టీవీ ని మీరు కేవలం రూ.35,999 కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఎస్బిఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంతేకాదు ప్రొడక్ట్స్ పైన మీకు వన్ ఇయర్ వారంటీ అలాగే పానెల్ పైన మరొక వన్ ఇయర్ వారంటీ కూడా లభిస్తుంది. ఇక స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే..3840 x 2160 పిక్సెల్స్ అల్ట్రా హెచ్డి సొల్యూషన్ తో ఈ స్మార్ట్ టీవీ డిస్ప్లే ఉంటుంది.

One Plus U1S 50 Inches Smart TV Beat Features
One Plus U1S 50 Inches Smart TV Beat Features

60 Hz రిఫ్రెష్ రేట్ తో పాటు 30W సౌండ్ అవుట్ పుట్ ను కూడా అందిస్తుంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై పనిచేసే ఈ స్మార్ట్ టీవీ గూగుల్ అసిస్టెంట్ , క్రోమ్ కాస్ట్ ఇన్ బుల్ట్ ను కూడా కలిగి ఉంటుంది. సపోర్టెడ్ యాప్స్ విషయానికి వస్తే నెట్ ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి పలు ఓటిటి యాప్లకు మద్దతు ఇస్తుంది. ఇకపోతే కస్టమర్ నుంచి 4.4 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది ఈ స్మార్ట్ టీవీ. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే త్రీ హెచ్డిఎంఐ ఫోర్స్ టు యు ఎస్ బి ఫోర్స్ అలాగే వైఫై కనెక్టివిటీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.