OnePlus Smart TV : ప్రముఖ టెక్ దిగ్గజం వన్ ప్లస్ ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ టీవీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ టీవీలు మీకు మంచి వినోదాన్ని అందివ్వడమే కాకుండా థియేటర్ అనుభవాన్ని కూడా అందిస్తాయి. ఇకపోతే ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్ కార్ట్ అలాగే అమెజాన్లో కొనుగోలు చేస్తే మీకు భారీ ఆఫర్లు లభించడమే కాకుండా బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసే వారికి మరింత ఆఫర్ కూడా లభిస్తుంది. ఇకపోతే ఈ క్రమంలోనే వన్ ప్లస్ స్మార్ట్ టీవీ తాజాగా 65 ఇంచులు కలిగిన స్మార్ట్ టీవీ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక ఈ స్మార్ట్ టీవీ మీకు మంచి వినోదాన్ని పాటు అద్భుతమైన ఫ్యూచర్లను కూడా అందిస్తూ ఉండడం గమనార్హం.
ఇకపోతే వన్ ప్లస్ నుంచి అందుబాటులో ఉన్న One Plus U1S 65 ఇంచెస్ అల్ట్రా హెచ్డి 4k ఎల్ఈడి స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ.. ఇక ఈ స్మార్ట్ టీవీ కంపెనీ ప్రకటించిన ధర రూ.69,999 గా ప్రకటించింది. కానీ ఫ్లిప్ కార్ట్ ఈ స్మార్ట్ టీవీ పై 11% డిస్కౌంట్ తో రూ.61,999 కే సొంతం చేసుకోవచ్చు. అంటే ఏకంగా 8 వేల రూపాయల తగ్గింపుతో లభిస్తుంది. అంతేకాదు ఫెడరల్ బ్యాంకు, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు కార్డ్స్ ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా 2,000 రూపాయల వరకు తగ్గింపు లభిస్తుంది. అప్పుడు ఈ స్మార్ట్ టీవీ ని మీరు కేవలం రూ.59,999 కే సొంతం చేసుకోవచ్చు.
60 HZ రీఫ్రెష్ రేట్ తో, 3840 x 2160 పిక్సెల్ రిజర్వేషన్ తో ఈ స్మార్ట్ టీవీ వస్తుంది. 30 W సౌండ్ అవుట్ పుట్ ను కూడా అందిస్తుంది. అంతేకాదు గూగుల్ అసిస్టెంట్ , క్రోమ్ కాస్ట్ ఇన్ బుల్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి . ఇక సపోర్టెడ్ యాప్స్ విషయానికి వస్తే నెట్ ఫ్లెక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, యూట్యూబ్ వంటి పలు ఓటిటి యాప్లకు మద్దతు లభిస్తుంది. మరీ ముఖ్యంగా కస్టమర్ మెచ్చిన ఈ స్మార్ట్ టీవీ ఏకంగా కస్టమర్ నుంచి 4.4 స్టార్ రేటింగ్ ను కూడా సొంతం చేసుకుంది. అద్భుతమైన మంచి థియేటర్ వినోదాన్ని అందిస్తుందని చెప్పవచ్చు.