One Plus 11 Phone : ప్రముఖ టెక్ దిగ్గజం వన్ ప్లస్ 10 T స్మార్ట్ ఫోన్ ఈ సంవత్సరం చివరి ప్రీమియం మోడల్ అవుతుందని అంతా అనుకున్నారు.. కానీ కంపెనీ అంచనాలను మారుస్తూ.. వన్ ప్లస్ తదుపరి ప్రీమియం ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ మోడల్ వన్ ప్లస్ 11 సీరీస్ ను లాంచ్ చేసే పనిలో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఇకపోతే వన్ ప్లస్ 11 సీరీస్ లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. కొన్ని నివేదికల ప్రకారం ఇప్పటికే కొన్ని ఫీచర్స్ లీక్ అవడం జరిగింది. చైనీస్ టిప్ స్టర్ ప్రచురించిన నివేదిక ప్రకారం వన్ ప్లస్ 11 సిరీస్ మోడల్ ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది.
ఇకపోతే ఈ కొత్త ఫోన్ వన్ ప్లస్ 11 సీరీస్ స్మార్ట్ ఫోన్ నుండి ఆశించిన ముఖ్యాంశాలలో ఒకటి స్మార్ట్ ఫోన్ శక్తివంతంగా ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ఇక ఈ ఫోన్ క్వాల్ కం స్నాప్ డ్రాగన్ 8Gen 2 ద్వారా పనిచేస్తుందని చిప్ సెట్ అంచనా వేయబడింది. ఇకపోతే దీని ద్వారా మరింత శక్తిని పొందుతుందని సూచించింది. మెరుగైన పనితీరును అందించడానికి సిద్ధమవుతున్న ఈ వన్ ప్లస్ 11 సిరీస్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఆధారపడిందని సమాచారం. ఇకపోతే ఈ కొత్త వన్ ప్లస్ 11సీరీస్ స్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ ల ధర ఇంకా వెల్లడించలేదు. ఇకపోతే త్వరలోనే అన్ని విషయాలను వెల్లడిస్తామని కూడా వన్ ప్లస్ వెల్లడించింది.
ఇకపోతే ఇప్పటికే విడుదలైన వన్ ప్లస్ 10T ప్రో ప్రస్తుతం కస్టమర్లను బాగా ఆకట్టుకుంటోందని చెప్పవచ్చు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ 8GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర ప్రస్తుతం రూ.49,999 గా నిర్ణయించబడింది. మరొక వేరియంట్ విషయానికి వస్తే..12GB ర్యామ్ + 256 GB స్టోరేజ్ మోడల్ ధర రూ.54,999.. అదేవిధంగా ఈ పరికరం యొక్క హైవేరియంట్ 16GB ర్యామ్, 256 GB స్టోరేజ్ వేరియంట్ మోడల్ ధర రూ.55,999. ఇక ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లు మీకు మూన్ స్టోన్ బ్లాక్, జెడ్ గ్రీన్ వంటి రెండు కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోను వన్ ప్లస్ 11 సిరీస్ మోడల్ కూడా 16GB ర్యామ్ తో వస్తున్నట్లు సమాచారం.