OnePlus 10T 5G : వన్ ప్లస్ 10T 5G లాంచింగ్ డేట్ విడుదల.. ఫీచర్స్ ఇవే..!!

OnePlus 10T 5G : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం అయినటువంటి వన్ ప్లస్ పై ఇటీవల కాలంలో వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా వన్ ప్లస్ కొనుగోలు చేయడానికి చాలామంది కష్టమర్లు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఇందులో ఉండే అత్యధిక అధునాతన ఫీచర్లను ఉపయోగించాలనే ఆత్రుతతోనే చాలామంది వన్ ప్లస్ బ్రాండ్ కు షిఫ్ట్ అవుతున్నారని నివేదికలో వెల్లడించారు. ఇటీవల వన్ ప్లస్ నుంచి నార్డ్ 2 T స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయగా విశేషమైన స్పందన లభించింది. దీంతో ఆగస్టు 3వ తేదీన భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించింది వన్ ప్లస్.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే స్నాప్ డ్రాగన్ 8 + Gen 1 SoC తో రానుంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ధర సుమారుగా 50వేల రూపాయలు ఉంటుందని సమాచారం. ఇకపోతే భారత మార్కెట్లో త్రీ స్టోరేజ్ వేరియంట్ ఆప్షన్లతో విడుదల కానున్నట్లు సమాచారం ఇక వాటి ధరల విషయానికి వస్తే.. 8GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ వేరియంట్ మోడల్ ధర రూ.49,999. 12 GB +256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.54,999 గా నిర్ణయించారు. ఇక వన్ ప్లస్ 10T5G కూడా మనకు 16 జిబి ర్యామ్ ఆప్షన్ తో లభిస్తుంది. ఇక దీని ధర సుమారుగా రూ.55,998 గా వన్ ప్లస్ అధికారులు నిర్ణయించారు. ఇకపోతే జెడ్ గ్రీన్, మూన్ స్ట్రోక్ , బ్లాక్ కలర్స్ లో ఈ ఫోన్ విడుదల అవుతున్నట్లు సమాచారం. ఇకపోతే అమెజాన్ లో ఆగస్టు 6వ తేదీ నుంచి అమ్మకానికి పెట్టబోతున్నారట.

One Plus 10T 5G Launch Date Released in Features
One Plus 10T 5G Launch Date Released in Features

ఇక అలాగే వన్ ప్లస్ ఇండియా వెబ్సైట్లో కూడా మీరు సొంతం చేసుకోవచ్చు . ఇక ఆఫ్లైన్ ద్వారా ఎక్స్ క్లూజివ్ ఎక్స్పీరియన్స్ స్టోర్లలో ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.. ముఖ్యంగా బ్యాంకు ఆఫర్ ద్వారా కొనుగోలు చేసే వారికి 1500 రూపాయలు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది . దీంతో మీరు ఈ స్మార్ట్ ఫోన్ ను 1500 తగ్గింపు ధరతో సొంతం చేసుకోవచ్చు. ఇక కెమెరా విషయానికి వస్తే 50 ఎంపీ సోనీ IMX 766 మెయిన్ కెమెరా తో పాటు 16 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 2 ఎంపీ మ్యాక్రో కెమెరా కూడా లభించనుంది . సెల్ఫీ కోసం 32 ఎంపీ కెమెరాను అమర్చారు. ఇక 6.7 అంగుళాల ఫుల్ హెచ్డి AMOLED ను కూడా కలిగే ఉంటుంది. ఇక 120 ఎడ్జెస్ రిఫ్రెష్ రేటు సపోర్టుతో పాటు 150 W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో 4800 MAH బ్యాటరీ ని కూడా కలిగి ఉంటుంది.