Dog Story : సమాజానికి లావణ్య లహరి జీవితం ఒక పాఠం మహిళ కష్టాల్లో ఇదొక కోణం ప్రకాశం జిల్లాకి చెందిన లహరి చిన్నప్పటి నుంచి చదువుల తల్లి.. బీటెక్లో 96% సాధించి మల్టీ నేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ సంపాదించింది. ఐదేళ్లలోనే ఉన్నత శిఖరాలకు చేరింది. అయితే బీటెక్లో ఉండగానే ఆమెకు ఓ నీచుడు ప్రేమ పేరుతో వెంటపడ్డాడు. అతనే వెంకటేశ్వరరావు ప్రైవేట్ ఎయిర్ లైన్స్ లో పైలెట్ తనకి ప్రేమ ఇష్టం లేదని చెప్పినా కూడా సినిమా వేషాలు వేశాడు. డబ్బులు ఉన్నాయి కదా అని ప్రేమను ఖరీదైన గిఫ్ట్ లతో వ్యక్తపరిచాడు. క్రమశిక్షణతో పెరిగిన లావణ్య అతడు ఏం చేసినా డబ్బు దాంబికం ప్రదర్శించిన పట్టించుకోలేదు. ఆమె తండ్రి ఈశ్వరయ్య ఓ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్.
లావణ్య ఇంట్లో బాగా పెరిగి చదువుకుంది. మరోవైపు లావణ్య ఎంత చదువుకున్న మంచి ఇంటికి పెళ్లి చేసి పంపాలని తన తండ్రి కోరిక.ఈ విధంగా పెరిగిన తన కూతురు అంటే తన తండ్రికి ఎంతో ప్రేమ. అయితే ప్రేమంటే ఇష్టం లేదని చెప్పినా కూడా తన ఇంటికి వచ్చి నేను పైలెట్లో పని చేస్తున్నాను.అని చెప్పి లావణ్య పేరెంట్స్ ని బ్రతిమలాడుకున్నాడు.అతను చెప్పిన మాటలు విని నిజమే అనుకొని మరోవైపు లావణ్యని అడిగితే మీ ఇష్టమే మా ఇష్టం అని చెప్పిన లావణ్య దీంతో లావణ్య పేరెంట్స్ పెళ్ళికి ఒప్పుకున్నారు.అలా వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
ఇద్దరు కూడా హైదరాబాదులోని సెటిల్ అయ్యారు. మొదటి ఏడాది వరకు బాగానే ఉన్నారు. కానీ రెండవ ఏడాది నుంచి అతడి లో ఉన్న మృగం బయటికి వచ్చింది. ప్రతిరోజు కొట్టడం తిట్టడం చేసేవాడు. ఆమెకి మూడుసార్లు అభ్యాసం అయింది. కొట్టేది చూస్తూ తన ఇంట్లో విశ్వాసం ఉన్న కుక్క కనికరించినా కూడా ఈ కుక్క మాత్రం కనికరించలేదు. ఒకవైపు ఈ సమస్య మరో వైపు భర్త ఆరోపణలకు తట్టుకోలేకపోయింది లావణ్య. అంతేకాకుండా మరో అమ్మాయితో కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఈ నీచుడు. ఇది గుర్తించిన లావణ్య.. నువ్వు అసలు మనిషివేనా అంటూ ఆ దుర్మార్గుడు అసలు విషయం బయట పెట్టింది. మొత్తం ఫ్యామిలీ తేడాగా ఉన్నారు అంటూ… నీ గురించి ఏం చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు.
సరే నాకు అన్యాయం చేసావ్ వేరే అమ్మాయితో ఉన్నావ్ కదా ఆ అమ్మాయితో అయినా మంచిగా ఉండు నేను నిన్ను చంపాలి అని అనుకోవడం లేదు.కానీ నేనే చనిపోతాను అంటూ ఆవేదనతో వీడియో రికార్డ్ చేసి ఫేస్ బుక్ లో అప్లోడ్ చేసి ఫ్యాన్ కి ఉరి వేసుకొని చనిపోయింది లావణ్య…