Samantha : ఏ మాయ చేసావే సినిమాలో కలిసి జంటగా నటించిన సమంత నాగచైతన్య.. ఆ సినిమా షూటింగ్లో ప్రేమలో పడి పెద్దల అంగీకారంతో మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. గత ఏడాది మేము విడిపోతున్నాం అంటూ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. సమంతా నాగచైతన్య నుండి విడిపోయిన తర్వాత ఆ మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడిన సంగతి తెలిసిందే. ఇటీవల శాకుంతలం సినిమా ప్రమోషన్లలో సమంత దక్షిణ కొరియా నుంచి ట్రీట్మెంట్ తీసుకొని రాగా.. సమంత చాలా నీరసంగా, బక్క చిక్కిపోయి కళావిహీనంగా కనిపించింది. ఇది చూసి గుండె తరుక్కుపోయిన నాగచైతన్య ఎలాగైనా సమంతని కలవాలని డిసైడ్ అయ్యాడట. సంక్రాంతి పండుగ అందరికీ పెద్ద పండుగ. ఈ పండుగ రోజున సమంతా తో కలిసి నాగచైతన్య ఫిక్స్ అయ్యాడట.
అందుకే భోగి రోజు తన మనసులో ఉన్న చెడు అంతా చెరిపేసి.. ఆ భోగి మంటల సాక్షిగా తనకు మరొకసారి దగ్గర కావాలని.. సమంత ఇంటికి నాగచైతన్య వెళ్ళారని.. ఇక పండగను ఇద్దరూ కలిసి చేసుకొని ఉన్నారని సమాచారం. నాగచైతన్య సమంత ఇంటికి ఒక ఫ్రెండ్ గా వెళ్లడా.. లేదంటే మళ్లీ వీళ్ళిద్దరూ కలుసుకోనున్నారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి వీళ్లిద్దరూ ఒక్కటవుతారన్న న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ న్యూస్ ఇరు ఫాన్స్ కి ఆనందాన్ని కలిగిస్తోంది.