NTR30: ఎన్టీఆర్ – కొరటాల మూవీ టైటిల్ ఫిక్స్.. ఆశ్చర్యంలో ఫ్యాన్స్..!

NTR 30: ప్రస్తుతం అభిమానులకు ఎన్టీఆర్ 30 సినిమాపై చాలా హోప్స్ ఉన్నాయి.. ముఖ్యంగా కొరటాల శివ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ అభిమానులలో మరింతగా ఆశలు నెలకొల్పుతున్నారు. రీసెంట్గా జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ ని అఫీషియల్ గా కన్ఫామ్ చేస్తూ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇందులో రెండవ హీరోయిన్గా మృనాల్ ఠాకూర్ నటిస్తోంది. కాబట్టి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా త్వరలోనే వస్తోంది అంటూ సమాచారం. ఇందులో ఉండగా తాజాగా ఈ సినిమా టైటిల్ కి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో లీక్ అయ్యి చాలా వైరల్ గా మారుతుంది.

NTR30: Raudranga NTR first look.. What did he do? – ntr30 first look poster  trending in social media

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న ఎన్టీఆర్ థర్టీ సినిమాకు దేవర అనే టైటిల్ ఫిక్స్ చేశారట డైరెక్టర్. ఈ క్రమంలోనే ఫిలిం ఛాంబర్ లో టైటిల్ రిజిస్ట్రేషన్ చేస్తున్న సమయంలో ఈ టైటిల్ లీక్ అయినట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు ఫుల్ ఖుషి తో పాటు ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తున్నారు.. ఇంత త్వరగా సినిమా టైటిల్ లీక్ చేయడం ఏంటి అంటూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా ఏ విధంగా సక్సెస్ అందుకుంటుందో చూడాలి.