NTR District: ఎన్టీఆర్ జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ రోడ్డుపై ఎక్కడ నీరు పోసినా రక్తం లాంటి ఎర్రటిద్రవం ఉబికి వస్తున్న పరిస్థితి వారిని భయాందోళనకు గురిచేస్తుంది. పెనుగంచిప్రోలు మండలం శనగపాడు ఎస్సీ కాలనీలో ఉన్న సిమెంట్ రోడ్డుపై నీరు పోస్తే రక్తం లాంటి ఎర్రటి ద్రవం బయటకు వస్తుంది. ఇలా ఒకసారి కాదు రెండు సార్లు ప్రతిసారీ ఇలా జరగడంతో స్థానికులు భయపడుతున్నారు.. ఈ వింత సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. పైగా అధికారులు కూడా ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో చుట్టూ పక్కల గ్రామాల వారు ఈ వింత సంఘటన చూడటానికి వస్తున్నారు..

ఎన్టీఆర్ జిల్లా వాసులు రోడ్డుపై రక్తం వంటి ద్రవం ఉబికి వస్తున్న ఘటన పై పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేస్తున్నాయి.. ఎవరో చేతబడి చేశారని.. చేతబడి చేయడం వల్ల ఇలా జరిగిందని.. దీని వలన మాకు ఏదైనా హాని జరుగుతుందని పలువురు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై ఎక్కడ నీళ్ళు పోసినా రక్తం బయటకు వస్తుందంటూ వాపోతున్నారు.
మరి కొంతమంది మాత్రం రోడ్డు వేసినప్పుడు ఉపయోగించిన కెమికల్స్ వల్ల ఇలా జరుగుతుందని అందుకు భయపడాల్సిన అవసరం లేదని కొట్టి పారేస్తున్నారు.. మూఢనమ్మకాలను నమ్ముతున్న వారు.. ఇది ఎవరో చేతబడి చేశారని.. అందుకే ఇలా జరుగుతుందని కంగారు పడుతున్నారు. రోడ్డుపై ఎక్కడ నీళ్ళు పోసినా రక్తం వంటి ద్రావణం బయటకు వస్తుంది అనే విషయాన్ని నిగ్గు తేల్చాలని అధికారులను కోరుతున్నారు అక్కడి ప్రజలు.
అధికారులు వెంటనే స్పందించి విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ వింత సంఘటన చూడటానికి చుట్టూ పక్కల గ్రామాల వారు అక్కడి వస్తున్నారు. అధికారులు స్పందించక పోతే మూడ నమ్మకాలు పై ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని అనుకుంటున్నారు.