Mobile : ఇప్పుడు దోమలను చంపడం మరింత తేలిక.. మీ మొబైల్ తోనే.. అసలు విషయం తెలిస్తే షాక్..!!

Mobile : అసలే వర్షాకాలం పైగా దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలోనే మనం ఎక్కువగా ఇబ్బంది పడుతుంటే..ఇక ఈ దోమల బెడద వల్ల మరిన్ని కష్టాలను కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా దోమల వల్ల మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి ఎన్నో ప్రాణాంతకమైన వ్యాధులు కూడా చుట్టుముడతాయి. అందుకే ప్రతి ఊరిలో ఉండే ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు.. ప్రతి రెండు రోజులకు ఒకసారి ఇంటిముందు కొన్ని రకాల కెమికల్స్ ను దోమల నివారణ కోసం చల్లుతూ ఉంటారు. ఇక మరి ముఖ్యంగా ఎంతోమంది దోమలను అదుపు చేయలేక ఇంట్లో దోమల కాయిల్స్, ఆల్ అవుట్ వంటివి పెడుతున్నా వాటి బెడద మరింత తీవ్రతరం అవుతుంది. అయితే ఇకపై దోమలను తరిమి కొట్టడానికి కొన్ని రకాల మొబైల్ యాప్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి.

టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఇలాంటి యాప్స్ అందుబాటులోకి రావడంతో చాలామంది గృహిణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే కొన్ని రకాల యాప్లను మీరు మీ మొబైల్ ఫోన్లో యాక్టివేట్ చేయడం వల్ల వాటి నుంచి విడుదల అయ్యే ఫ్రీక్వెన్సీ, సౌండ్ దోమలను తరిమికొట్టేలా చేస్తుంది. మరి ఆ యాప్ లు ఇప్పుడు ఒకసారి మనం చదివి తెలుసుకుందాం. ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి మస్కిటో కిల్లర్, మస్కిటో సౌండ్, ఫ్రీక్వెన్సీ జనరేటర్ వంటి తదితర యాప్లను అందుబాటులో ఉంచిన నేపథ్యంలో మీకు నచ్చిన యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే కేవలం ప్లే స్టోర్ ద్వారా మాత్రమే డౌన్లోడ్ చేసుకుంటేనే జెన్యూన్ యాప్ లని గుర్తించాలి.

Now killing mosquitoes is easier with your mobile
Now killing mosquitoes is easier with your mobile

ఇక ఇప్పటికే ఈ యాప్స్ ను కొన్ని మిలియన్ల సంఖ్యలో డౌన్లోడ్ చేయబడ్డాయి. ఇక వీటిని స్మార్ట్ ఫోన్ లు ఇన్స్టాల్ చేసి ఆన్ చేయడం ద్వారా దోమలను తరిమికొట్టే అల్ట్రాసోనిక్ సౌండ్ ఫ్రీక్వెన్సీ ని ఉత్పత్తి చేస్తాయి. ఇక ఈ సౌండ్ మనకు వినిపించదు కానీ దోమలను తరిమి కొట్టడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. సాధారణంగా చాలామందికి సందేహం కలగవచ్చు. ఇటువంటి యాప్స్ నిజంగా దోమలను తరిమి కొడతాయా అనే సందేహం కూడా కలుగుతుంది. ఎందుకంటే ఈ యాప్స్ కి మిక్స్డ్ రివ్యూ ఉన్నాయి కాబట్టి..ఇక కొంతమంది బాగానే పనిచేస్తున్నాయని చెబితే అసలు వీటితో ఎటువంటి యూజ్ లేదని చెప్పేవారు కూడా ఉన్నారు. గూగుల్ ప్లే స్టోర్ అందుబాటులో ఉన్న ఈ యాప్ ని ప్రయత్నించి చూస్తే ఖచ్చితంగా మీకే తెలుస్తుంది.