Jobs Notification : కోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఎన్ని పోస్టులు ఉన్నాయంటే..?

Jobs Notification : నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఒక గొప్ప శుభవార్త ను తీసుకు వచ్చింది. తాజాగా పలు ఉద్యోగాలను భర్తీ చేస్తే వస్తోంది.. ఢిల్లీ హైకోర్టు ఖాళీగా ఉన్న హయ్యర్ జ్యుడీషియల్ సర్వీస్ ఎగ్జామ్ కు సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఆసక్తికరమైన అభ్యర్థులు.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తోంది.. ప్రస్తుతం ఈ పోస్టులకు సంబంధించి ఖాళీల వివరాలు, జీతభత్యాలు, ఎంపిక విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Notification for jobs in the court How many posts are there
Notification for jobs in the court How many posts are there

1). మొత్తం ఖాళీల సంఖ్య: 123 పోస్టులు. ఢిల్లీ హయ్యర్ జ్యుడీషియల్ సర్వీస్ ఎగ్జామ్ కింద ఈ ఏడాది ఈ పోస్టులను భర్తీ చేయనుంది.

2). వయసు : జనవరి 1 -2022 నాటికి అభ్యర్థుల వయసు 32 సంవత్సరాలు మించకూడదు.

3). అభ్యర్థుల జీతభత్యాలు : ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు జీతం చెల్లిస్తారు.

4). అర్హతలు : భారతీయ పౌరుడై ఉండాలి.. అంతేకాకుండా అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తూ ఎక్స్పీరియన్స్ ఉండాలి.

5). ఎంపిక విధానం : అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుందట.

6). ప్రిలిమినరీ పరీక్ష తేదీ : వచ్చే నెల 27వ తేదీ పరీక్ష నిర్వహించనున్నారు.

7). దరఖాస్తు విధానం : ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి.. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మార్చి 20వ తేదీ గా ప్రకటించడం జరిగింది.

8). దరఖాస్తు ఫీజు : అభ్యర్థులు అప్లై చేసుకునే వారు ..SC,ST,PWD అభ్యర్థులకు 200 రూపాయలు. GENERAL/OTHER అభ్యర్థులకు ఫీజు.. రూ.1000 రూపాయలు.

ఆసక్తికరమైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నిhttps://delhihighcourt.nic.in/ చూసుకోవాలి. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. అంతేకాకుండా మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ను కూడా ఇందులో ఉంచ వలెను.