NOTHING:నథింగ్ ఫోన్ పై ఊహించని డిస్కౌంట్.. బిగ్ బిలియన్ ఆఫర్..!

సెప్టెంబర్ 23 నుంచి ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రముఖ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించడం జరిగింది. ఇంకా ఈ క్రమంలోని బాగా హైప్ తో రిలీజ్ అయిన నథింగ్ ఫోన్ పై కూడా భారీ డిస్కౌంట్ ప్రకటించింది ఫ్లిప్ కా. ముఖ్యంగా ఫ్లిప్ కార్ట్ అందిస్తున్న బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ఈ స్మార్ట్ ఫోన్ రూ. 30 వేల లోపే మీరు కొనుగోలు చేయవచ్చు. ఇకపోతే దసరా, దీపావళి సందర్భంగా ఫ్లిప్ కార్ట్ ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే స్మార్ట్ ఫోన్ లపై భారీ డిస్కౌంట్ లభిస్తున్నాయి. మరి నథింగ్ ఫోన్ వన్ స్మార్ట్ ఫోన్ మీరు కేవలం ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో రూ.28,999 కే సొంతం చేసుకోవచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఆఫర్స్ తో పాటు తక్కువ ధరకే ఈ మొబైల్ ని కొనే అవకాశం ఉంటుంది. ఇకపోతే సేల్ ప్రారంభమైన తర్వాత ఆఫర్స్ కు సంబంధించిన అన్ని పూర్తి వివరాలను ఫ్లిప్ కార్ట్ వెల్లడించనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం 3 వేరియంట్ లలో లభిస్తోంది ఈ స్మార్ట్ ఫోన్.8GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.32,999..8GB ర్యామ్ + 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.35,999. 12GB ర్యామ్ + 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.38,999. ఇక ఆ తర్వాత ఈ స్మార్ట్ ఫోన్ పై 1,000 రూపాయల వరకు ధర పెరిగింది.. ఇక ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ పై భారీ ఆఫర్లు లభిస్తున్నట్లు సమాచారం. ఫ్లిప్ కార్ట్ అందిస్తున్న బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ఈ స్మార్ట్ ఫోన్ అన్ని ఆఫర్స్ కలిపి రూ.28,999 కే బేస్ మోడల్ ను సొంతం చేసుకోవచ్చు. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే నథింగ్ స్మార్ట్ ఫోన్ పై మీరు రూ. 5,000 తగ్గింపును పొందినట్లే.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే..120 HZ రీఫ్రెష్ రేట్ తో 6.55 అంగుళాల ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడి డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాదు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ పై ప్రొటెక్షన్ తో ముందు, వెనుక గ్లాస్ బాడీ అల్యూమినియం ఫ్రేమ్ లాంటి ఫీచర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తుంది. 50 మెగా పిక్సెల్ కెమెరాతో పాటు 50 మెగా పిక్సెల్ సెకండ్ కెమెరా కూడా ఉంటుంది. ఇక సెల్ఫీ కోసం 16 మెగా పిక్సెల్ కెమెరా అమరిచారు.33 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 4500 ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇక 5W రివర్స్ చార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది.