Nothing Phone : రూ.12 వేలకే నథింగ్ ఫోన్.. త్వరపడండి.. ఆఫర్ కొద్ది రోజులే..!!

Nothing Phone : మార్కెట్లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే మంచి ఆదరణ పొందిన నథింగ్ ఫోన్ 1 గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు నెలల క్రితం ఒక హాట్ టాపిక్ ఈ స్మార్ట్ ఫోన్ అని చెప్పవచ్చు. ఇక సరికొత్త డిజైన్తో రిలీజ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ కొనడానికి కస్టమర్లు సైతం పోటీపడ్డారు. సేల్ కన్నా ముందే ప్రీ ఆర్డర్స్ చేశారు. ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ.12 వేల లోపే సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది. వినడానికి ఇది నమ్మశక్యం కాని వార్త అని చెప్పవచ్చు. ఇకపోతే ఫెస్టివల్ రానున్న నేపథ్యంలో ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఈ సేల్ లో భాగంగా మీరు ఈ స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ధరల విషయానికి వస్తే.. 8GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ వేరియంట్ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.33,999 కాగా 8GB ర్యామ్ + 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.36,999. ఇక హైవేరియంట్ 12GB ర్యామ్ + 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999.. ప్రస్తుతం ఈ స్మార్ట్ఫోన్ పై రూ.1000 పెరిగిన విషయం తెలిసిందే. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ఐసిఐసిఐ బ్యాంక్, ఆక్సిస్ బ్యాంక్ కార్డుల ద్వారా నథింగ్ ఫోన్ వన్ బేస్ వేరియంట్; రూ.28,999 వద్ద లభిస్తోంది.

Nothing phone offer for Rs. 12 thousand only for a few days
Nothing phone offer for Rs. 12 thousand only for a few days

అంటే ప్రస్తుతం ఉన్న ధరకన్నా రూ.5000 తక్కువకే పొందవచ్చు.ప్రస్తుతం వైట్ , బ్లాకు కలర్స్ లో కూడా లభ్యమవుతోంది. అంతే కాదు మీ పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేసే వారికి అదిరిపోయే ఆఫర్ లభిస్తుంది అని చెప్పవచ్చు . నథింగ్ ఫోన్ వన్ స్మార్ట్ ఫోన్ కొంటే ఎక్స్చేంజ్ ద్వారా ఏకంగా రూ.17వేల వరకు తగ్గింపు లభిస్తుంది. ఇక ఇలా ఆఫర్ పూర్తిస్థాయిలో మీకు లభ్యమవుతే.. మీరు కేవలం రూ.11, 999 కే కొనుగోలు చేయవచ్చు. ఇంత అద్భుతమైన ఆఫర్ను అసలు మిస్ కావద్దు. ఆఫర్ సెప్టెంబర్ 30 తేదీ వరకే ఉంటుంది కాబట్టి త్వరపడండి.