Nokia New Brands : సెల్ఫోన్ ప్రపంచంలోనే నోకియా మొట్టమొదటి బ్రాండ్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికి కూడా నోకియా బ్రాండ్ ను ఉపయోగించే కష్టమర్లు లేకపోలేదు. కీప్యాడ్ ప్యాట్రెన్ తో నోకియా సరికొత్త మోడల్స్ గతంలో బిజినెస్ ఇండస్ట్రీలోకి ప్రవేశపెట్టి ఆ తర్వాత ఎంతో మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ఇకపోతే స్మార్ట్ ఫోన్లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని నోకియా నుంచి స్మార్ట్ ఫోన్లు వచ్చినా అవి పెద్దగా క్లిక్ అవ్వలేదని చెప్పాలి. దీంతో మళ్లీ పాత కీప్యాడ్ ప్యాట్రెన్ కలిగిన మొబైల్స్ కి సరికొత్త రంగులు హద్దుతూ మరో సరికొత్త ఫీచర్లను జత చేసి ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది.
ఇక ఈ క్రమంలోనే నోకియా మరో మూడు సరికొత్త ఫీచర్ ఫోన్లను ప్రపంచ మార్కెట్లో విడుదల చేసింది. ఇక వాటిలో నోకియా 2660 Flip, నోకియా 8210 4G, నోకియా 5710 ఎక్స్ ప్రెస్ ఆడియో ఫీచర్ ఫోన్లు.నోకియా 2660 Flip మొబైల్ పాత మోడల్ లో కొత్త ఫీచర్లతో వచ్చిన నోకియా 8210 4G ఫీచర్ ఫోన్. ఇక నోకియా ఎక్స్ప్రెస్ సిరీస్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ముఖ్యంగా నోకియా 5710 ఎక్స్ప్రెస్ ఆడియో ఫోన్ను ఎన్నడూ చూడని విధంగా వెనుక ఇన్బిల్ట్ టి డబ్ల్యూఎస్ బడ్స్ తో లాంచ్ చేసింది నోకియా. ఇక నోకియా కొత్తగా ఆవిష్కరించిన ఈ ఫీచర్ ఫోన్లు ప్రపంచ మార్కెట్లో విడుదల అయ్యాయి. ఇక వీటి ధరల విషయానికి వస్తే నోకియా 8210 4G, నోకియా 2660 ఫ్లిప్ లను ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.6000 వరకు ఆఫర్ చేసింది.
నోకియా 5710 ఎక్స్ప్రెస్ ఆడియో ని మీరు పొందాలనుకుంటే 7,000 రూపాయలను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక వీటి ఫీచర్స్ విషయానికి వస్తే.. నోకియా 2660 ఫ్లిప్.. ఫీచర్ ఫోన్ పేరు సూచించినట్లుగా చాలా అద్భుతంగా ఉంది లోపల అలాగే వెనుక రెండు డిస్ప్లే ఉంటాయి. Unisoc T107 ప్రాసెసర్ తో ఈ ఫోన్ పనిచేస్తుంది అలాగే 128 ఎంబి ఇన్బిల్ట్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.1, 450 mah బ్యాటరీ తో పాటు వైర్లెస్ ఎఫ్ఎం కెమెరా విజిఏ కెమెరా కూడా అందుబాటులో ఉన్నాయి. మిగతా రెండు ఫీచర్ ఫోన్లలో కూడా ఇలాంటి అద్భుతమైన ఫీచర్లను అందించడం జరిగింది. ఇక మూడూ కూడా తక్కువ ధరకే లభించడంతో కష్టమర్లు కూడా వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.