Nokia G21 Smart Phone : నోకియా G21 స్మార్ట్ ఫోన్ కేవలం రూ.800 లోపే.. ఇలా చేస్తే సరి..!!

Nokia G21 Smart Phone : నోకియా G21 స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో సాధారణ ధర రూ.16,999 దగ్గర నిర్ణయించబడింది. కానీ ఈ స్మార్ట్ ఫోన్ 11% తగ్గింపు తర్వాత రూ.14,999 కే లభిస్తుంది. ఇక మీరు చెల్లించేటప్పుడు ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే మీకు రూ.750 క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది. ఇక ఆ తర్వాత మీరు ఈ స్మార్ట్ ఫోన్ రూ.14,249 ధర కే కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు ఈ స్మార్ట్ ఫోన్ ను ఎక్స్చేంజ్ ఆఫర్ తో కేవలం రూ. 800 కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. అయితే మీరు ఈ ఆఫర్ పొందాలి అంటే కచ్చితంగా ఎక్స్చేంజ్ ఆఫర్ తీసుకోవాల్సిందే.

సాధారణంగా రూ.16,999 ఈ స్మార్ట్ ఫోన్ ను 11% తగ్గింపుతో రూ.14,999 కే సొంతం చేసుకోవచ్చు. ఇక మీరు మీ పాత ఫోన్ కు బదులుగా దీనిని కొనుగోలు చేయడం వల్ల రూ.14,250 వరకు ఫాదర్ చేసుకునే అవకాశం ఉంటుంది.మీరు ఈ స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ ఆఫర్ యొక్క పూర్తి ప్రయోజనాన్ని పొందినట్లయితే కేవలం ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.749 గా వుండవచ్చు. ఇక మీరు ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ లో డిస్కౌంట్ పొందాలనుకుంటే ఎక్స్చేంజ్ చేయాలనుకుంటున్న మొబైల్ మెరుగైన పనితీరును కలిగి ఉండాలి. ఇక మీ మొబైల్ పనితీరు ఆధారంగానే ఆఫర్ వర్తిస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే.. 6.5 అంగుళాలు ఫుల్ హెచ్డి డిస్ప్లేను అందిస్తున్నారు.

Nokia G21 Smart Phone is just under Rs.800
Nokia G21 Smart Phone is just under Rs.800

Octa – Core Unisoc T606 కలిగి ఉంటుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ పై పనిచేస్తుంది. ఇక కెమెరా కూడా అద్భుతమైన పర్ఫామెన్స్ ని ఇస్తుంది అని సమాచారం.ఇక ట్రిపుల్ కెమెరా సెటప్ ను కలిగి ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ లో 50 మెగా పిక్సెల్ క్వాలిటీ కలిగిన ప్రధాన కెమెరా ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. ఇక 2 మెగాపిక్సల్ క్వాలిటీతో మాక్రో సెన్సార్ లెన్స్, 2 మెగా పిక్సెల్ క్వాలిటీతో డెప్త్ సెన్సార్ లెన్స్ అలాగే సెల్ఫీ కోసం 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాని కూడా అటాచ్ చేయడం జరిగింది. ఇక చార్జింగ్ విషయానికి వస్తే 10 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5050 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీని అందిస్తున్నారు.