Battery Empty : సాధారణంగా మన స్మార్ట్ ఫోన్ లో బ్యాటరీ పూర్తిగా ఖాళీ అయిందంటే కచ్చితంగా స్విచ్ ఆఫ్ అవుతూ ఉంటుంది.. ఇదిలా ఉండగా ప్రతి సంవత్సరం రెండు ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లకు బదులుగా హువాయ్ ఇప్పుడు ఒక ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక ఈ క్రమంలోనే 2022లో హువాయ్ మేట్ 50 లైన్ స్మార్ట్ ఫోన్లు విడుదల చేయబోతోంది. ఇకపోతే గత సంవత్సరం అద్భుతమైన కెమెరా ఫీచర్లతో P50 ప్రో స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. ఇకపోతే అందుకు జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని అమెరికా ఆరోపించిన తర్వాత గూగుల్ అలాగే ఇతర యూఎస్ కంపెనీల నుండి చిప్ సెట్ లను కొనుగోలు చేయకుండా హువాయ్ నిషేధించబడింది.
ఈ క్రమంలోనే హువాయ్ తన సొంత హార్మోనీ OS ను అభివృద్ధి చేసింది. ఎన్నో అవాంతరాలు, వివిధ సమస్యలు ఉన్నప్పటికీ కొత్త ఆవిష్కరణ మాత్రం ఆపలేదు. చైనా నుండి వచ్చిన నివేదికల ప్రకారం హువాయ్ మేట్ 50 లైన్ స్మార్ట్ ఫోన్ అత్యవసర బ్యాటరీ మోడ్ ను కూడా కలిగే ఉంటుంది అని స్పష్టం చేసింది. ఇక బ్యాటరీ పూర్తిగా ఖాళీ అయినప్పుడు కూడా ఈ స్మార్ట్ ఫోన్ నుంచి కాల్స్, టెక్స్ట్ మెసేజ్ లు చేసుకోవడానికి వీలు కల్పిస్తోందని కంపెనీ స్పష్టం చేసింది. ఇకపోతే అత్యవసర బ్యాటరీ మోడల్ ముందే ఆన్ చేసి ఉంచుకోవాలని, అప్పుడే అత్యవసర పరిస్థితుల్లో కూడా కాల్స్ అలాగే మెసేజ్లు కూడా ఇతరులకు పంపవచ్చు అని తెలిపింది.
ఇకపోతే బ్యాటరీ డౌన్ అవుతున్న సమయంలో ఆటోమేటిగ్ గా అత్యవసర బ్యాటరీ మోడ్ నుంచి పవర్ ను తీసుకుంటుంది. ఇక ఈ ఫీచర్ హార్మొనీ OS 3.0 కింద ప్రవేశపెట్టబడింది. ఇకపోతే ఈ మోడల్స్ ఈ ఓ ఎస్ తో ముందే ఇన్స్టాల్ చేయబడ్డాయి. ముఖ్యంగా ఈ ఫీచర్ తో కాల్స్ చేయడం, టెక్స్ మెసేజ్లు పంపడం, డాక్యుమెంట్లు మరియు ఇతర లొకేషన్ కోడ్ లను కూడా స్కాన్ చేయడం వంటివి సాధ్యమవుతుంది. నిజానికి అత్యవసర పరిస్థితిలో చార్జింగ్ అయిపోయినప్పుడు మనం మనకు కావాల్సిన వారికి కాల్స్ లేదా టెక్స్ట్ మెసేజ్ చేయడం సాధ్యపడదు. కానీ హువాయి తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ స్మార్ట్ ఫోన్ ద్వారా బ్యాటరీ అయిపోయినా సరే నిరంతరాయంగా ఇలా టెక్స్ట్ మెసేజ్ లతో పాటు కాల్స్ కూడా చేయవచ్చు. ఇక అద్భుతమైన ఫ్యూచర్ ని చూసి కస్టమర్లు సైతం మెచ్చుకుంటున్నారు.