OPPO A15S ; ప్రముఖ టెక్ దిగ్గజం అయిన ఒప్పో ఇటీవల కాలంలో సరికొత్త స్మార్త ఫీచర్లతో కూడిన స్మార్ట్ఫోన్లను ప్రవేశ పెడుతూనే సరికొత్తగా డిస్కౌంట్లను కూడా ప్రకటిస్తూ వస్తోంది. ఇక ఈ క్రమంలోనే ఒప్పో నుంచి A15s స్మార్ట్ ఫోన్ పై సుమారుగా రూ.1500 తగ్గింపు కూడా ఉంటుంది . ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ 2 వేరియంట్ లలో అందుబాటులో ఉండడం గమనార్హం. ఇక ఒక్కొక్క వేరియంట్ విషయానికి వస్తే.. 4GB ర్యామ్ + 64 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,990.. అలాగే 4 GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,990 కి అందుబాటులో ఉంది.
ఇక ఇతర ఫీచర్స్ కూడా కస్టమర్లను బాగా ఆకట్టుకుంటున్నాయని చెప్పాలి. ఈ స్మార్ట్ ఫోన్ 4,200 ఎం ఏ హెచ్ బ్యాటరీ తో వస్తుంది. ఇక కలర్స్ విషయానికి వస్తే డైనమిక్ బ్లాక్ , ఫ్యాన్సీ వైట్, రింబో సిల్వర్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇక అంతేకాదు ఈ ఫోన్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి అనే విషయానికి వస్తే ఈ ఫోన్ 720 x 1520 పిక్సెల్ స్క్రీన్ రెజల్యూషన్ ను కలిగి ఉంటుంది. 6.52 అంగుళాల డిస్ప్లేను వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్ తో కలిగి ఉండడంతో పాటు డిస్ప్లే ఆస్పెక్ట్ రేషియో 19:9 పిక్సెల్ డెన్సిటీని కలిగి ఉంటుంది..
మీడియా టెక్ హీలియో P35 SoC ప్రాసెసర్ తో పనిచేస్తుంది అంతేకాదు ఆండ్రాయిడ్ టెన్ ఆధారిత కలర్ OS 7.2 పై రన్ అవుతుంది. ఇక కెమెరా విషయానికి వస్తే.. 13 మెగా పిక్సెల్ సెన్సార్ తో రియల్ బ్యాక్ కెమెరాను అమర్చబడి ఉంచారు. అంతేకాదు 2 మెగాపిక్సల్ మైక్రో లెన్స్ తో పాటు రెండవ కెమెరా అలాగే 2 మెగాపిక్సల్ సెన్సార్ తో మూడవ కెమెరా కూడా అమర్చారు. ఇక సెల్ఫీ కోసం 8 మెగాపిక్సల్ సెన్సార్ కెమెరాను కూడా అందించారు. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే వైఫై, బ్లూటూత్, హాట్స్పాట్, మైక్రో యూఎస్బీ వంటి ఇతర కనెక్టివిటీ ఎంపికలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం తక్కువ ధరకే లభిస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ తక్కువ బడ్జెట్ లో స్మార్ట్ ఫోన్ కావాలనుకునే వారిని మరింత ఆకర్షిస్తోందని చెప్పవచ్చు.