Xiaomi Smart TV : షావోమీ నుంచీ సరికొత్త స్మార్ట్ టీవీ.. ఫీచర్స్ తో పాటు ధర కూడా అదర్స్..!

Xiaomi Smart TV : షావోమీ.. కస్టమర్ల కోసం వినూత్నంగా ఆలోచించి సరికొత్త స్మార్ట్ ఫీచర్లతో కూడిన స్మార్ట్ టీవీ లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్మార్ట్ టీవీలు మీకు మంచి వినోదాన్ని పంచడమే కాకుండా మీ ఇంటికి థియేటర్ అనుభూతిని తీసుకొస్తాయి. అంతేకాదు ఇప్పుడు ఈ కామర్స్ దిగజమైన ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి ప్లాట్ఫారం ద్వారా మీరు కొనుగోలు చేసినట్లయితే మంచి డిస్కౌంట్ తో పాటు అదనంగా బ్యాంకు బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. ఈ క్రమంలోని షావోమీ సరికొత్త స్మార్ట్ టీవీ ని అద్భుతమైన ఫీచర్స్ తో ధర తక్కువలో తీసుకురావడం జరిగింది. మరి స్మార్ట్ టీవీ మోడల్ ఏమిటి? దాని ఫీచర్స్? స్పెసిఫికేషన్స్?

ఇలా పూర్తి వివరాలను ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. Mi 4X 50 ఇంచెస్ అల్ట్రా హెచ్డి 4k ఎల్ఈడి స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ.. కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసినప్పుడు ఈ స్మార్ట్ టీవీ ద్వారా రూ.41,999.. కానీ ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేస్తే 26% డిస్కౌంట్ తో మీరు కేవలం రూ.30,999.. మాత్రమే. అంతేకాదు ఫెడరల్ బ్యాంకు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు కార్డ్స్ ద్వారా కొనుగోలు చేస్తే 10% డిస్కౌంట్ లభిస్తుంది. అంటే మరో 2 వేల రూపాయలు అదనంగా తగ్గే అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ స్మార్ట్ టీవీ ని మీరు రూ.28,999కి సొంతం చేసుకోవచ్చు. 60 Hz రీఫ్రెష్ రేటుతో వచ్చి ఈ స్మార్ట్ టీవీ 20W సౌండ్ ఔట్ పుట్ ను కూడా అందిస్తుంది.

New Smart TV from Xiaomi
New Smart TV from Xiaomi

ఇక 3840 x 2160 పిక్సెల్స్ రెజల్యూషన్ తో అల్ట్రా హెచ్ డి 4k డిస్ప్లేను అందిస్తుంది. అంతేకాదు గూగుల్ అసిస్టెంట్ అలాగే క్రోమ్ కాస్ట్ ఇన్బిల్ట్ వంటి ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక సపోర్టెడ్ యాప్స్ విషయానికి వస్తే నెట్ ఫ్లెక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, యూట్యూబ్ వంటి ఓటీటీ యాప్ లకు మద్దతు ఇస్తుంది. 2 GB ర్యామ్ కెపాసిటీతో 8GB స్టోరేజ్ మెమోరీని అందిస్తుంది. 3 HDMI పోర్ట్స్ తో పాటూ 2USB పోర్ట్స్ కూడా అమర్చబడి ఉంటాయి. అంతేకాదు మరెన్నో ఫీచర్లతో వచ్చిన ఈ స్మార్ట్ టీవీ మీకు ప్రోడక్ట్ పైన ఒక సంవత్సరం వారంటీ అలాగే ప్యానెల్ పై మరొక సంవత్సరం అదనంగా వారంటీ లభిస్తుంది.