Xiaomi Smart TV 5A Pro : షావోమీ నుంచీ సరికొత్త స్మార్ట్ టీవీ.. ఫీచర్స్ అదుర్స్..!

Xiaomi Smart TV 5A Pro : షావోమీ.. ఎప్పటికప్పుడు కస్టమర్లను ఆకట్టుకునే విధంగా అద్భుతమైన ఫీచర్లతో కూడిన స్మార్ట్ టీవీలను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా స్మార్ట్ టీవీలను మాత్రమే కాదు స్మార్ట్ ఫోన్స్ అలాగే ఇయర్ బడ్స్.. ఇలా చెప్పాలంటే మరెన్నో వస్తువులను తీసుకొస్తూ తన విస్తృతను చాటుకుంటుంది షావోమీ.. ఇక ఈ క్రమంలోనే తాజాగా ఒక స్మార్ట్ టీవీ ని అందుబాటులోకి తీసుకొస్తూ తక్కువ ధరకే అందించడమే కాకుండా అద్భుతమైన ఫీచర్స్ ని కూడా అందుబాటులోకి తీసుకొస్తుంది. మరి ఈ స్మార్ట్ టీవీ యొక్క స్మార్ట్ ఫీచర్స్ గురించి మనం చదివి తెలుసుకుందాం..

షావోమీ స్మార్ట్ టీవీ 5A ప్రో.. ఈ స్మార్ట్ టీవీ 32 అంగుళాల డిస్ప్లే తో లభిస్తుంది. అంతేకాదు డాల్బీ ఆడియో 24 స్పీకర్స్ అలాగే సరికొత్త ప్రాసెసర్ లాంటి ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ స్మార్ట్ టీవీ యొక్క ధర కేవలం రూ.16,999 మాత్రమే. ఇకపోతే ఈ స్మార్ట్ టీవీ మొదటి అమ్మకం ఆగస్టు 29 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అయింది. ఇక ఈ స్మార్ట్ టీవీ ని షావోమీ అధికారిక వెబ్సైట్ తో పాటు ఎమ్ఐ హోమ్ స్టోర్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ప్లాట్ఫామ్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇక ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.1500 తక్షణ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇక డిస్కౌంట్ లభించిన తర్వాత ఈ స్మార్ట్ టీవీ ని కేవలం రూ.15,499 కే సొంతం చేసుకోవచ్చు.

New Smart TV from Xiaomi Smart TV 5A Pro Features
New Smart TV from Xiaomi Smart TV 5A Pro Features

ఇక 60 HZ రిఫ్రెష్ రేట్ తో ప్రీమియం మెటల్ బెజెల్ లెస్ ఫ్రేమ్ తో వస్తుంది. 178 వ్యూయింగ్ యాంగిల్ ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. ఇకపోతే ఇందులో మోడల్ క్వాడ్ కోర్ A35 ప్రాసేసర్ కు అప్గ్రేడ్ ప్రాసెసర్ ఇది . ఇందులో 1.5 జిబి ర్యామ్ అలాగే 8GB ఇంటర్నల్ స్టోరేజ్ లాంటి ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ.. ఆండ్రాయిడ్ టీవీ 11 బేస్డ్ ప్యాచ్ వాల్ ఆపరేటింగ్ సిస్టం తో పనిచేస్తుంది. అంతేకాదు 30కి పైగా భారతీయ భాషలు, ఇంటర్నేషనల్ కంటెంట్ పాట్రాన్స్ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది . అంతేకాదు 300కు పైగా లైవ్ చానల్స్ కూడా చూడవచ్చు. టు హెచ్డిఎంఐ 2.0 స్లాట్స్, టు యు ఎస్ బి స్లాట్స్, ఒకటి ఎతర్నెట్ పోర్టు, బ్లూటూత్ 5.0 , వైఫై లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి.

Advertisement