VIVO : దేశంలోని అతి పెద్ద టెక్ దిగ్గజం వివో V25 ప్రో ను లాంచ్ ని సూచిస్తూ ఉన్న టీజర్ ను షేర్ చేసింది వివో..అంతేకాకుండా ప్రో మోడల్ v25 సిరీస్ లో మొదటి ఫోన్ ఇదే కారణం గమనార్హం. ఇక వీటి ధర , స్టోరేజ్ , స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. ఇక ఈ మైక్రో సైట్ లు వివో v25 ప్రో స్మార్ట్ ఫోన్స్ స్పెసిఫికేషన్స్ మరియు ముఖ్య లక్షణాలను విడుదల చేయడం జరిగింది. ఇక అధికారిక టీజర్ ఈ ఫోన్ యొక్క కీలక స్పెసిఫికేషన్లో పై కూడా కొంత సమాచారాన్ని అందిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే మొదట ఇది రంగులు మారే వెనుక ప్యానెల్ తో వస్తుందని తెలియజేసింది.
ఇక ఈ ఫోన్ 3D కర్వ్డ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఫోటోగ్రఫీ విభాగంలో వెనకవైపు మూడు కెమెరాలు అమర్చబడి ఉంచారు. మీడియా టెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్ ను తీసుకొస్తుంది. అంతేకాదు ప్రముఖ ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా ఈ స్మార్ట్ ఫోన్ను ఉపయోగిస్తూ ఉండడం గమనార్హం. అలాగే 4830ఎంహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది.. అంతేకాదు 66 W ఫ్లాష్ ఛార్జ్ ఫాస్ట్ చార్జింగ్ కలిగి ఉంటుంది ఇక 120 ఎడ్జెస్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్లు కలిగి ఉంటుంది. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే..8 GB ర్యామ్ గూగుల్ పే కన్సోల్ లో కనిపిస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారంగా పనిచేస్తుంది.
ఇక కెమెరా విషయానికి వస్తే 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు ప్రధాన కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి మద్దతు ఇస్తుంది. ఇక వ్లాగ్ మోడల్ తో సహా అనేక ఫీచర్లను ఈ స్మార్ట్ ఫోన్ తీసుకొస్తుందని సమాచారం. ఇక ఈ స్మార్ట్ ఫోన్ లో ప్రధాన కెమెరా హైబ్రిడ్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి కూడా మద్దతు ఇస్తుందట. స్మార్ట్ ఫోన్ టర్న్ చేసినప్పుడు కలర్స్ చేంజ్ అవ్వడం ఈ స్మార్ట్ ఫోన్ కి ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా కస్టమర్స్ కూడా ఈ స్మార్ట్ ఫోన్ కి ఆకర్షితులవుతున్నారు . అయితే భారత మార్కెట్లో ఎప్పుడు లాంచ్ చేస్తారు అనే విషయాన్ని తెలియజేయలేదు. కానీ కమింగ్ సూన్ అంటూ అధికారికంగా ప్రకటించడం జరిగింది. మరి ఈ స్మార్ట్ ఫోన్ ఎలా ఉండబోతుంది? ఎంత ధర ఉంటుంది? అని అంచనాలు కూడా లేకుండా ఉండడం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది.