Tecno Spark 8P : టెక్నో నుంచి న్యూ స్మార్ట్ ఫోన్. .ఫీచర్స్ అదుర్స్..!!

Tecno Spark 8P : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ అయినటువంటి టెక్నో..ఇండియన్ మార్కెట్లోకి ఎప్పటికప్పుడు అదిరిపోయే బడ్జెట్ ఫోన్ లను లాంఛ్ చేస్తూ కస్టమర్లను మరింత ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్లపై ఇప్పటివరకు ఒక కంప్లైంట్ కూడా రాకపోవడం గమనార్హం. ఇక ఇటీవల 7000 ఎంఏహెచ్ బ్యాటరీ తో 6.9 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లే తో టెక్నో పోవా 3 చౌక ధరలో లాంచ్ చేసి ఆశ్చర్యపరిచింది. ఇక ఇప్పుడు టెక్నో నుంచి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ స్పార్క్ 8p పేరిట మరో బడ్జెట్ ఫోన్ ను పరిచయం చేయడానికి సిద్ధమయ్యింది. ఇక ఈ క్రమంలోని ఈ ఫోన్ కి సంబంధించిన లాంచ్ తేదీని కూడా ఖరారు చేశారు. మరి ఈ టెక్నో స్పార్క్ 8p స్పెసిఫికేషన్లో డిజైన్లు స్పష్టంగా వెల్లడించడం జరిగింది. ఆ ఫీచర్లు ఏంటి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

Advertisement

ఇదిలా ఉండగా పోయిన ఏడాది గ్లోబల్ మార్కెట్లో టెక్నో స్పార్క్ 8p లాంచ్ అయింది. టెక్నో సన్నాహాలు చేస్తుంది. ఇక ఈస్మార్ట్ మొబైల్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే ముందుగా సెటప్ తో 50 ఎంపీ కెమెరాను అమర్చారు. ఇక రోజంతా పవర్ అందించే 7 GB వర్చువల్ రామ్ తో టెక్నో స్పార్క్ 8p త్వరలోనే వస్తుందని తాజాగా వెల్లడించారు. ఇకపోతే బ్లూ కలర్ వేరియంట్ తో మొబైల్ అందుబాటులోకి రావచ్చని సమాచారం. ముఖ్యంగా కొన్ని రీసెంట్గా లీకైన ఇండియన్ వేరియంట్ ఫీచర్లను బట్టి చూస్తే మనం గ్లోబల్ లాంచ్ వేరియంట్ ఫోన్లో ఎలాంటి ఫీచర్ లు అయితే వస్తాయో ఇండియన్ మార్కెట్లో అదే ఫీచర్ లతో విడుదలవుతుంది.ఇక ఈ ఫోన్లో కూడా అలాంటి ఫీచర్లే లభిస్తాయి అని సమాచారం.

Advertisement
New smart phone from techno feachers adhurs
New smart phone from techno feachers adhurs

ఇక ఆ ఫీచర్ ఏమిటి అంటే ఫుల్ హెచ్డి రిజల్యూషన్ తో 6.7అంగుళాల డిస్ప్లే తో ఈ స్మార్ట్ మొబైల్ లభిస్తుంది. సెల్ఫీ కెమెరా ఉన్న భాగంలో వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ అందించారు. ఇక ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కోసం ఎయిట్ ఎంపీ కెమెరా అందించగా, వెనుక భాగంలో 50 ఎంపీ ప్రైమరీ కెమెరాను అందించినట్లు సమాచారం. ఇకపోతే మిగిలిన రెండు కెమెరాలు ఎంత మెగాపిక్సెల్ కెపాసిటీతో రానున్నాయి అనే విషయం ఇంకా తెలియలేదు. ఇకపోతే గ్లోబల్ వేరియంటలో 2 ఎంపీ పోర్ట్రైట్ , AI లెన్స్ ప్రైమరీ కెమెరాతో బ్యాక్ సైడ్ కూడా అందించారు. ఇక గ్లోబల్ మార్కెట్లో నాలుగు రంగులలో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ మొబైల్ ఇండియన్ మార్కెట్లో ఎలాంటి ఆప్షన్స్ తో రిలీజ్ అవుతుందో తెలియాలి..

Advertisement