New Rules: ప్రతినెల కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్న నేపథ్యంలో మార్చి నెలలో కూడా మన జోబుకు చిల్లుపెట్టే నియమ నిబంధనలు కూడా వచ్చేసాయి.. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం..
ఎస్బిఐ క్రెడిట్ కార్డ్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన క్రెడిట్ కార్డు విభాగం ఎస్బిఐ కార్డు కొత్త చార్జీలను ప్రకటించింది. కొత్త చార్జీలు 2023 మార్చి 17వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ఎస్బిఐ క్రెడిట్ కార్డు ఉపయోగించే ఎవరైనా సరే అద్దె చెల్లిస్తే రూ. 199 కి పైగా టాక్స్ లు చెల్లించాలి. గతంలో ఈ చార్జీలు కేవలం రూ.99 మాత్రమే ఉండేవి.
ఈపీఎఫ్ హైయ్యర్ పెన్షన్.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈపీఎఫ్ అధికారులు అధిక పెన్షన్ ఆప్షన్ ఎంచుకునే అవకాశం కల్పిస్తోంది ఈపీఎఫ్ఓ. అయితే దీనికి ఖాతాదారులు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులను సబ్మిట్ చేయడానికి 2023 మార్చి మూడు చివరి తేదీ.
ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ప్రైస్.. ఒకటో తేదీ నుంచి గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తూ ఉంటారు. అయితే ఈసారి మార్చ్ 1 వ తేదీన ఆయిల్ కంపెనీలు ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటాయో చూడాలి.
ఇండియన్ రైల్వేస్, బ్యాంకు లోన్స్, సోషల్ మీడియా ఇలా ప్రతిదాంట్లో కూడా మార్పులు చేసినట్లు సమాచారం.