Philips 7900 Smart TV : ప్రముఖ టెక్ తయారీ సంస్థలలో ఒకటిగా నిలిచిన ఫిలిప్స్ సంస్థ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కంపెనీ అందించే ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువు కూడా అత్యంత హైటెక్నాలజీతో కూడుకున్నది మాత్రమే కాదు వినియోగదారులకు మంచి అనుభూతిని కూడా అందిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా తమ కంపెనీ నుంచి కొత్త ఆండ్రాయిడ్ టీవీలను లాంచ్ చేయడం జరిగింది. ఇక మరి వాటి ఫీచర్లు అలాగే ధర కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫిలిప్స్ అందిస్తున్న స్మార్ట్ టీవీల విషయానికి వస్తే.. ఫిలిప్స్ 7900 అంబిలైట్ మీకు మూడు సైజులలో అందుబాటులో ఉంది.
55 , 65 , 75 అంగుళాల మోడల్స్ మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది. ఇక ఒక్కొక్క మోడల్ యొక్క ధరలో కూడా వేరియేషన్స్ ఉన్నాయి. వాటి విషయానికి వస్తే.. ఫిలిప్స్ 7900 55 ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ ధర రూ. 99,990 కాగా ఫిలిప్స్ 7900 65 ఇంచెస్ మోడల్ ధర 1,49,900..ఫిలిప్స్ 7900 75 ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ ధర రూ.1,89,990 గా కంపెనీ నిర్ణయించింది. ఇకపోతే లాంచ్ అయిన కొత్తలో ఈ ఆండ్రాయిడ్ టీవీలు మొదట్లో ఎంపిక చేసిన ఆఫ్లైన్ స్టోర్లలో మాత్రమే కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. కానీ ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసే అవకాశం కల్పించినట్లు ఎక్కడ చెప్పబడలేదు. ఇక వీటి ఫీచర్స్ విషయానికి వస్తే కొత్త ఫిలిప్స్ 7900 అంబిలైట్ టీవీ సీరీస్ HDR 10 + డాల్బీ విజన్ తో పాటు ఫోర్ కే అల్ట్రా హెచ్డి ఎల్ఈడి డిస్ప్లేను అందిస్తుంది.
అంతేకాదు టీవీ అంచులో ఉన్న ఇంటలిజెంట్ ఎల్ఈడీ లతో ఈ ఆండ్రాయిడ్ టీవీ లభించడం గమనార్హం. ముఖ్యంగా ఆన్ స్క్రీన్ చర్యకు ప్రతిస్పందిస్తుందని అలాగే లీనమయ్యే విజన్ ను విడుదల చేస్తుందని ఫిలిప్స్ తాజాగా వెల్లడించింది. అంతేకాదు 20 W RMW తో డాల్బీ సౌండ్ కి మద్దతు ఇస్తుందని సమాచారం . ఇక ఖచ్చితమైన ఫిక్సెల్స్ తో పాటు అల్ట్రా హెచ్డి ఇంజన్ ను కూడా కలిగి ఉంటుంది. మీకు ఈ ఆండ్రాయిడ్ టీవీలో సినిమాలు చూసిన అంతసేపు థియేటర్లలో చూసే అనుభూతి పక్కా కలుగుతుందని ఫిలిప్స్ వెల్లడించింది. అమెజాన్ ప్రైమ్ వీడియో , నెట్ఫ్లిక్స్ , డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ తో పాటు గూగుల్ క్రోమ్ కాస్ట్, గూగుల్ అసిస్టెంట్, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వి 5.0 వంటి ఫీచర్లు అందుబాటులో. 4 HDMI స్లాట్ తో పాటు రెండు యూఎస్బీ స్లాట్స్ అలాగే డిజిటల్ ఆడియో కోర్ట్, హెడ్ ఫోన్ జాక్ వంటి అనేక ఫీచర్స్ ను కూడా కలిగి ఉన్నాయి.