Low Budget House : సొంతిల్లు ప్రతి మనిషి కనే కల. పుల్ల పుడక ముక్కున తెచ్చి పక్షి గూడు కట్టుకున్నట్టుగా ఒక్కో ఇటుగా పేరుస్తూ మనిషి ఇల్లు కట్టుకుంటాడు. అది పూర్తి అవ్వడానికి చేతినిండా డబ్బు కావాలి.. సామాన్యుడికి సొంత ఇంటి కల ఎప్పటికీ తీరని విధంగా ఉంటుంది. ఎన్నాళ్లు డబ్బులు పోగేసిన ఇంకా ఎంతోకొంత అవసరం పడుతూనే ఉంటుంది లక్ష రూపాయల్లో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటే ..అది కూడా రేకుల ఇల్లు కట్టుకోవాలి అనుకునే వారికి ఈ వీడియో అద్భుతంగా సహాయపడుతుంది.

ఈ వీడియోలో ఒక లక్ష రూపాయల్లో వారి బడ్జెట్ కు అనుకూలంగా సొంత ఇంటిని నిర్మించుకోవచ్చు.. హౌస్ ప్లాన్ ప్రకారం ఒక బెడ్ రూమ్, వంటగది, బాత్ రూమ్ ను అతి తక్కువ ఖర్చులో మన బడ్జెట్ కు అనుగుణంగా మలుచుకునే ప్లాన్ ఇది. ఈ ఇంటి నిర్మాణానికి ఐరన్ పైపులను ఉపయోగించారు. రెండున్నర ఎత్తు కలిగిన ఐరన్ పైపులను వేసి ఈ ఇంటిని నిర్మించారు. 8 ఇంచుల బ్రిక్స్ రాయిని ఈ ఇంటి నిర్మాణానికి ఉపయోగించారు.
ఈ ఇంటికి వాడిన అల్యూమినియం రాడ్స్, సిమెంటు బస్తాలు, ఇసుక, వాటర్ పైప్స్, వైరింగ్, డోర్స్, మిగతా అన్ని సామాన్లు, వాటిని కట్టినందుకు అయిన మొత్తం ఖర్చు కేవలం లక్ష రూపాయలు మాత్రమే అవుతుంది. ఇందుకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని మీరు ఈ వీడియో లో చూసి తెలుసుకోవచ్చు.