Librarian Love Story :అస్సాంలోని లక్కింపూర్ జిల్లాలో నబాకతి అనే గ్రామంలో నబీన్ సైకియా అనే రైతు ఉండేవాడు.తన ఏకైక కూతురు పేరు నందిత సైకియా. ఈమె చదువుతోపాటు యాక్టింగ్,డాన్స్ లో కూడా టాప్ లో ఉండేది.చదువులో కూడా ఫస్ట్ ఉండేది. అయితే దగ్గరలో కాలేజ్ లేదని మంచి పేరున్న కాలేజీలో జాయిన్ చేశాడు తన తండ్రి.ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని కాలేజీకి మంచి పేరు తెచ్చింది. అయితే నందిత కాళీ ఉన్న సమయంలో లైబ్రరీ కి వెళ్ళేది. అక్కడ రింటు శర్మ అని అబ్బాయి ఆమె అందాన్ని చూసి ప్రేమించి బుట్టలో పడేయాలి అనుకున్నాడు. అయితే ఆమె ఏది అడిగినా కూడా కాదనకుండా తీసిఇచ్చేవాడు. అతని మంచితనాన్ని చూసింది. తర్వాత కొద్ది రోజులకు రింటు చూపులు మరియు ప్రవర్తన ఆమెకే అర్థమయిపోయాయి. తర్వాత లైబ్రరీకి వెళ్లడం మానేసింది.

తర్వాత కొద్ది రోజులకు పరీక్షలు దగ్గర కావడంతో లైబ్రరీకి వెళ్ళింది. అయితే రింటు అప్పటికి ఇంకా ఆమె మీద ప్రేమను పెంచుకొని ఆమె రాగానే లవ్ లెటర్ రాసి బుక్కులో పెట్టి మీ అభిప్రాయం తెలుపమని రాశాడు. ఆమె తన ముందే చించేసి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది. అయితే తర్వాత కొద్ది రోజులకు మరీ వెంటపడి ప్రేమించు అంటూ చాక్లెట్ ఇచ్చి అలా ఇలా కొద్దిరోజులు ఆమె వెంటపడి వేధించాడు. ఆమె వెంటనే ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేయగా ప్రిన్సిపల్ అతడిని కాలేజీ నుంచి తొలగించడం జరిగింది. ఇంకా మరచిపోలేని రింటు కొద్దిరోజుల తర్వాత ఎగ్జామ్ రాసి గేటు దగ్గరికి వస్తుండగా నందిత కోసం కాపు కాస్తున్న రింటు పెద్ద కత్తితో ఆమె భుజాన్ని నరికేశాడు. అయితే రోడ్డు మీద వారు పట్టుకునేకి ప్రయత్నం చేయగా వారిపై కత్తి విసిరి తప్పించుకుపోయాడు రింటు.నందిత ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. నందిత ఆసుపత్రిలో వారం రోజులపాటు చికిత్స పొందుతూ ప్రాణాలను కోల్పోయింది.
పట్టబగలు నందితని నరికేసిన వాడిని మరణి శిక్ష వేయాలి.. అంటూ మహిళా మండలి అందరూ కూడా ధర్నాలు చేశారు. పోలీసులు 15 రోజులకు రింటు ని పట్టుకొని జైలుకు తరలించారు. ఏకైక కూతురు చనిపోవడంతో తన తండ్రి కన్నీరు మున్నీరు అయిపోయారు.