Lover: దృశ్యం సినిమా చాలా మంది చూసే అందులో జరిగిన నేరం రియల్ లైఫ్ లో చేయడానికి ప్రయత్నించింది నీతూ.. కానీ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు నీతూ, హర్పాల్.. వీళ్ళిద్దరూ ఒకరంటే ఒకరికి ఇష్టం.. వీరి కలయిక కు అడ్డుగా అడ్డుగా ఉంటున్నాడని నీతూ భర్త సతీష్ ను ఇద్దరూ కలిసి చంపేయాలని ప్లాన్ వేసుకున్నారు..

ఘజియాబాద్ కు చెందిన చోటేలాల్.. 10 రోజుల నుంచి తన సోదరుడు సతీష్ పాల్ కోసం వెతుకుతున్నాడు. తను కనిపించక పోవడంతో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు సతీష్ గురించి ఆరా తీస్తుండగా.. నీతూ ఇంటికి అప్పుడప్పుడూ హర్పాల్ అనే వ్యక్తి వస్తుంటాడని. తెలుసుకుని పోలీసులు హర్పాల్‌ని కనిపెట్టి.. తడాఖా చూపించారు. దాంతో హర్పాల్ నిజం బయటపెట్టాడు. నీతు, గౌరవ్ సాయంతో సతీష్‌ని తానే చంపానని చెప్పాడు..
దాంతో పోలీసులు సతీష్ భార్య నీతూను ప్రశ్నించారు. భర్త కనిపించట్లేదని ఆమె కంప్లైంట్ ఇవ్వలేదు. ఊరెళ్లి ఉంటాడని అనుకున్నాను అని కహానీ చెప్పింది. ఇక ఆ ప్లాను కాగా అమలు చేశారు .జనవరి 23న సతీష్ కి నీతూ బాగా మందు తాగించింది. మద్యం మత్తులోకి జారుకున్న సతీష్ ని నీతో హరప్పా అతని స్నేహితుడు గౌరవ్ ముగ్గురూ కలిసి గొంతు నొక్కి చంపేశారు.
తర్వాత మెడకి టవల్ చుట్టి మరోసారి నొక్కరు.. ఆ తరువాత శవాన్ని మూటకట్టారు. ఇంటి పక్కనే సెప్టిక్ ట్యాంక్ కోసం తవ్విన గోతిలో పడేసి పూడ్చేశారు. పైన సెప్టిక్ ట్యాంక్ కట్టేశారు. శనివారం హర్పాల్, నీతూను అరెస్ట్ చేసిన పోలీసులు.. సతీష్ కోసం గాలిస్తున్నారు. దృశ్యం సినిమాను గుర్తు చేసిన ఈ ఘోరం దేశమంతా వైరల్ అయ్యింది.