Taraka Ratna : ఇదెక్కడి దారుణం రా బాబు – తారకరత్న హెల్త్ ఆరోగ్యం గురించి లేటెస్ట్ అప్డేట్ ఇదేనా ?

Taraka Ratna : నందమూరి తారకరత్న యువగళం పాదయాత్రలో పడిపోవడం.. ఆయన ఆరోగ్యం విషమంగా మారిపోవడం.. ఆ తరువాత బెంగళూరుకి తీసుకు వెళ్లడం అక్కడ కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని చెప్పటం.. ఆ తరువాత రోజుకో కథనం రావటం సీరియస్ అన్నారు కుటుంబ సభ్యులు.. ఆ తరువాత బాలకృష్ణ మృత్యుంజయ మంత్రం చెప్పడంతో తారకరత్న స్పృహలోకి వచ్చారని.. ఆ తరువాత హెల్త్ బులిటెన్ కూడా విడుదల చేశారు. ఆ తర్వాత ఆయనను విదేశాలకు తీసుకువెళ్లాలని అన్నారు.. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారు అని యాంకర్ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ ను ప్రశ్నించారు..

ఆయన తారకరత్న ఆరోగ్య విషయం గురించి మాట్లాడుతూ.. తారకరత్న ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయాలోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.. బాలకృష్ణ ఆయన్ని హాస్పిటల్ కి తీసుకు వెళ్లేటప్పుడు తారకరత్న కోమాలోకి వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. ఆ తరువాత హార్ట్ ఆటోమేటిగ్ గా బ్లాక్ అయింది. బాలకృష్ణ తారకరత్న దగ్గర పెద్దగా మాట్లాడుతూ గట్టిగా అరిస్తే.. తారకరత్నలో చలనం వచ్చింది. నిజమేనా అని యాంకర్ అడిగాగా.. మృత్యుంజయ మంత్రం చెప్పారా అని అడుగుతుంది. మృత్యుంజయ మంత్రం అని కాదు . ఆయన ఏం మాట్లాడారో తెలియదు కానీ ఆయన మాట్లాడిన మాటలు తారకరత్నలో చలనం వచ్చింది అని మాత్రం వాస్తవం.. తారకరత్న లో బాలయ్య మాట్లాడిన మాటలతో చలనం వచ్చింది. దాంతో ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు వాస్తవం. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నది మాత్రం నిజం కాకపోతే ఆయన బాడీలో కాస్త చలనం అయితే ఉంది.

Natti Kumar reveals Taraka Ratna health condition buliton update
Natti Kumar reveals Taraka Ratna health condition buliton update

కొన్ని కొన్ని పార్ట్స్ కదులుతున్నాయి. కానీ ఆయన పరిస్థితి విషమంగా ఉన్నా కూడా ఆయన కోలుకొని ఆరోగ్యంగా బయటకు వస్తారు
ఆయన్ని విదేశాలకు. తీసుకువెళ్లారు అన్న వార్త మాత్రం అవాస్తవం. వాళ్ళ తాత, నానమ్మ ఆశీస్సులతో తారకరత్న ఆరోగ్యంగా బయటకు వస్తాడు. త్వరలోనే ఆయన ఆరోగ్యంగా బయటకు వస్తారు. ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తున్నారు.

విషమంగా ఉన్నా కానీ ఆయన మాత్రం ఆరోగ్యంగా బయటకు వస్తారని మీరు నమ్మకం వ్యక్తం చేస్తున్నారా అని యాంకర్ ప్రశ్నిస్తుంది.. అవునని నట్టి కుమార్ చెబుతారు. బ్రెయిన్ కి ఇంకా కొంచెం కష్టంగా ఉంది అయినా లో కదలికలు మాత్రమే ఉన్నాయి. ఇంకా స్పందించాల్సి ఉంది బయట చాలా రూమర్స్ వచ్చాయి. అవన్నీ నమ్మకండి. వాటిలో ఎలాంటి నిజాలు లేవు ఖచ్చితంగా ఆయన నా ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటపడి పూర్తి ఆరోగ్యంతో మళ్ళీ వస్తారు అని నట్టి కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు నేను చెప్పిన విషయాలని నాకు తెలిసిన సమాచారం ప్రకారం నేను మీతో చెబుతున్నాను అని నట్టి కుమార్ అన్నారు.