Suneetha: పవిత్ర లోకేష్ – నరేష్ రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు వినిపించాయి.. గతంలో వీరి మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.. కాగా పవిత్ర లోకేష్ – నరేష్ ఇద్దరు మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ సోషల్ మీడియా వేదికగా నరేష్ ఓ వీడియో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియోలో నరేష్ పవిత్రను లిప్ కిస్ చేశారు. దాంతో వీళ్లిద్దరూ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ అయ్యారు. తాజాగా నరేష్ పవిత్ర లిప్ కిస్ పై సింగర్ సునీత స్పందించారట..
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న సింగర్ సునీత ను నరేష్ పవిత్ర లిప్ లాక్ కిస్ గురించి అడగగా.. అది వారి వ్యక్తిగత విషయం.. వారి గురించి కామెంట్ చేసే రైట్ నాకు లేదు. అయినా వాళ్ళు మళ్ళీ పెళ్లి అని చెప్పగానే మీరు ఎలా నమ్మరు.. ఒకవేళ అది ఓ సినిమా టైటిల్ అనుకోండి.. మీరు ఇప్పటి వరకు రాసిందంతా చెప్పినవన్నీ మార్చలేరు కదా.. అయినా ఏదైనా దాయలి అనుకుంటే దాగదు. ఇక పెళ్లి అనేది అందరికీ చెప్పే చేసుకుంటాం ఎవరైనా.. సో.. అసలు ఏమైనా ఉంటే వల్లే చెబుతారా అని సునీత అంది.. మొత్తానికి సింగర్ సునీత నరేష్ పవిత్ర లోకేష్ పై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ జంట మళ్ళీ పెళ్లి చేసుకుంటారా లేదా సునీత అన్నట్టు నిజంగా అది సినిమా టైటిల్ ఆ అనేది తెలియాలంటే.. మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.