Naresh: టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ పై ఆయన మూడో భార్య రమ్య ఆరోపణలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రమ్య నరేష్ గురించి దారుణమైన విషయాలను బయటపెట్టారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

రమ్య నరేష్ క్యారెక్టర్ గురించి దారుణమైన విషయాలు చెప్పుకొచ్చారు. అందులో భాగంగా నరేష్ పెద్ద ఓమనైజర్ అని.. ఆయనికి అమ్మాయిల పిచ్చి ఉంది.. ఆయన పలుమార్లు అలా చేస్తూ నాకు దొరికితే పోయాడని రమ్య చెప్పింది. అంతేకాదు ఇల్లీగల్ ఎఫైర్ లో దొరికినప్పుడు నరేష్ ఏకంగా నా కాళ్లు కూడా పట్టుకొని బతిమిలాడాడు అంటూ రమ్య వివరించింది. తనకి సంబంధించిన అక్రమ సంబంధం గురించి బయటపడిన రెండు నెలలు నాతో చాలా బాగుంటాడని అప్పుడు సారీ చెబుతూ నన్ను బ్రతిమిలాడతాడని ఆ కొద్ది రోజులపాటు నాపై ప్రేమ ఉన్నట్టు నటిస్తూ తిరిగేవాడిని రమ్య చెప్పింది.
నరేష్ తల్లి విజయనిర్మల చనిపోయిన తర్వాత ఈయన పిచ్చి వేషాలు ఇంకా ఎక్కువ అయ్యాయి. ఇష్టం వచ్చినట్లు చేసేవాడని.. ప్రశ్నించేవారు లేకపోవడంతో విచ్చలవిడిగా ఇలాంటి వ్యవహారాలు చేస్తూ ఉండేవారని రమ్య తెలిపింది. విజయనిర్మల ఉన్నప్పుడు భయంతో భయపడేవాడు కాదని..
పవిత్ర నరేష్ ఇంత దగ్గర కావడానికి అదే ముఖ్య కారణం అని రమ్య వివరించింది. అందులో భాగంగానే నరేష్ ఎంత చెడ్డవాడు అయినప్పటికీ ఎందుకు నేను ఇంకా ఆయన కోరుకుంటున్నాను అని మీరు అనుకోవచ్చు.. ఎందుకంటే ఆయన నా భర్త.. నా కొడుకు కోసం నేను ఆయన్ని కోరుకుంటున్నాను అని రమ్య తెలిపింది.
ఆయన నన్ను వదిలించుకోవడానికి చాలా ఎత్తుగడలు వేశారని.. దేవుడు లాంటి కృష్ణ గారితో నాకు అక్రమ సంబంధం ఉందని పిచ్చిపిచ్చిగా వాగడని రమ్య తెలిపింది.. నరేష్ గురించి రమ్య చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.