Pavitra – Naresh: సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు నరేష్ -పవిత్ర లోకేష్. వీరిద్దరూ ఏం చేసినప్పటికీ ఎప్పుడు వైరల్ గా మారుతూనే ఉంటారు. ముఖ్యంగా ఈ వయసులో వీరిద్దరూ ప్రేమ వ్యవహారం అంటూ చేసిన రచ్చ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. ఇలా ఎన్నో రకాలుగా ట్రోల్ కి గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇది నరేష్ కు నాలుగవ వివాహం. ఇక ఏడాది సంవత్సరంలో వీరిద్దరూ లిప్ లాక్ చేసుకుంటూ విడుదల చేసిన ఒక వీడియో పెను సంచలనాన్ని సృష్టించింది.
కొంతమంది ఈ వయసులో ఇవేమీ పనులు అంటూ కూడా చివాట్లు పెట్టారు. ఇక ఇదంతా పక్కన పెడితే నరేష్ మూడో భార్య రమ్య.. నరేష్ కి విడాకులు ఇచ్చే సమస్యే లేదంటూ రచ్చ చేయడం కూడా మొదలు పెట్టింది. కానీ నరేష్ ఆమెను మాత్రం అన్ని విధాలుగా వదిలించుకోవాలని చూస్తున్నారు. దీంతో ఈమె పైన పలు ఆరోపణలు కూడా చేయడం జరిగింది. దీంతో రమ్య మాత్రం పట్టు వదలలేదు. ఇక గడిచిన రెండు రోజుల క్రితం నరేష్ ఇంటి పైన దాడి జరిగినట్టుగా కూడా తెలియజేశారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రమ్య పట్టు వదలకుండా పోరాటం చేయడం వల్లే నరేష్ – పవిత్ర విడిపోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.