Nara Lokesh.. కుప్పంలో మొదలైన నారా లోకేష్ పాదయాత్ర ఇప్పటికీ కొనసాగుతోంది. ఇకపోతే పాదయాత్రలో భాగంగా పులిచెర్ల మండలం కొత్తపేటలో నిర్వహించిన బహిరంగ సభలో నారా లోకేష్ మాట్లాడుతూ.. రాష్ట్రానికి పరిశ్రమలు రావడం అటు ఉంచితే.. జగన్ వల్ల ఉండేది కూడా పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయి అంటూ ఎద్దేవా చేశారు.. తాజాగా మేము తెచ్చిన ఫాక్స్ కాన్ కంపెనీ నిన్న తెలంగాణకు వెళ్ళిపోయింది. దీంతో లక్ష మంది ఉద్యోగాలు కోల్పోయారు. 2024 మే నెలలో చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయం. 2024లో టిడిపిదే అధికారం.. 2025 జనవరి నెలలో జాబ్ కాలెండర్ విడుదల చేయడం ఖాయమంటూ లోకేష్ స్పష్టం చేశారు.
గూగుల్లో గంజాయి కాపిటల్ ఏది అని అడిగితే ఆంధ్రప్రదేశ్ అని వస్తోంది. పదవ తరగతి పిల్లల్ని కూడా వైసిపి నాయకులు గంజాయి డీలర్లుగా మార్చేస్తున్నారు.. ప్రధాని నార్కోటిక్ బ్యూరో అధికారులకు ఏపీలో గంజాయి పరిస్థితుల గురించి లేఖ రాశారు.. రాష్ట్రాన్ని గంజాయి హబ్ గా మార్చేసిన సీఎంకు నేటి నుంచి గంజాయి మోహన్ రెడ్డి గా పేరు పెడుతున్నాను అంటూ లోకేష్ తెలిపారు..