Nara Lokesh : రెండుసార్లు మీడియా మీట్ లు ఆపే ప్రయత్నం చేసిన విశాఖ ఏసీపిని తెలుగుదేశం నాయకులు అడ్డుకున్నారు.. ఆ తరువాత గందరగోళ పరిస్థితుల్లో కూడా లోకేష్ మాట్లాడారు.. అటు విశాఖ ఎయిర్పోర్టు కు చేరుకున్నాక అక్కడ కూడా నిరసన తెలియజేశారు.. కేవలం తమను అడ్డుకున్నందుకే పోలీసులు సమయం కేటాయించే బదులు.. ఆ సమయంలో సామాన్య ప్రజలకు ఎంత న్యాయం చేయొచ్చు అని లోకేష్ అన్నారు.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు చెందిన నేతలు నన్ను మాట్లాడనివ్వండి.. మీరిచ్చిన నోటీసులు చదివాను..
మీరు మరీ హద్దు మీరు ప్రవర్తిస్తున్నారు. నేనొక శాసనసభ్యున్ని మీరు ఇచ్చిన నోటీసుల్లో ఏముందో పూర్తిగా అర్థం చేసుకున్నాను.. అయినా రోడ్డు మీద ఓ గౌరవ శాసనసభ్యుల్ని అవమానించడం ఎంతవరకు సబబు. మీరు వెళ్ళద్దన్నారు కనుక మేము పలాస వెళ్లడం లేదు. మీరు నోటీసులు ఇచ్చారు కాబట్టి మేము వాటిని దృష్టిలో ఉంచుకున్నాము.. శ్రీకాకుళం కేంద్రంగా పోలీసులు ఉన్నతాధికారులతో లోకేష్ మాట్లాడారు ఎన్నడూ లేని విధంగా మిగతా నాయకులంతా ఏకతాటిపై నిలిచి.. తమ నాయకుడికి అండగా ఉంటూ అడుగడుగునా ఐక్యత చాటారు.. ఆ విధంగా విపక్ష నేతలు లోకేష్ తో సహా ఇతర నాయకులు తమదైన పోరాటం సాగించి..
తమ నిరసనలు తెలిపి తాము చెప్పాలనుకున్నదేదో చెప్పారు. వైసిపి ప్రభుత్వం హయాంలో ఎప్పటినుంచో నెలకొన్న సంస్కృతి.. మాట్లాడే వారిని మాట్లాడనివ్వకపోవడమేనని ఇదే సంస్కృతిని ఆ రోజు తాము అమలు చేసి ఉంటే.. జగన్ పాదయాత్ర చేసేవారా అని లోకేష్ ప్రశ్నించారు.. ప్రశ్నిస్తే చాలు ఇంటికి జెసిబి ని పంపిస్తున్నారని.. ఇంతకన్నా దారుణం ఇంకేమైనా ఉందా అని లోకేష్ ఆవేదన చెందారు.. ఇదే వాదన పోలీసుల ఎదుట ముందు వినిపించారు.. శ్రీకాకుళం పర్యటన సందర్భంలో లోకేష్ తో సహా పలువురు నాయకులు నిన్న ప్రివెంటివ్ అరెస్టులకు గురయ్యారు..