Brahmini : బాలయ్య వీర సింహరెడ్డి సినిమా చూసి బ్రహ్మణి ఓకే ఒక్క మాట చెప్పింది.. సార్.. అంతే.! ఇక చాలు సార్..!

Brahmini: నందమూరి నరసింహ బాలకృష్ణ నటించిన లేటెస్ట్ చిత్రం వీర సింహారెడ్డి.. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకొని రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను వసూలు చేసింది. తాజాగా బాలకృష్ణ పెద్ద కూతురు బ్రహ్మణి వీరసింహారెడ్డి సినిమాను అభిమానుల మధ్య కూర్చుని వీక్షించింది.. హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో వీరసింహారెడ్డిని చూసిన బ్రాహ్మణి తనదైన శైలిలో రివ్యూ ఇచ్చింది..

Nara Brahmini Veerasimha Reddy review and sensational comments on balakrishna
Nara Brahmini Veerasimha Reddy review and sensational comments on balakrishna

వీర సింహారెడ్డి సినిమా చాలా బాగుందని.. అభిమానులకు నచ్చుతుందని చెప్పింది. తన తండ్రి సినిమాను అభిమానులతో వీక్షించడమే తనకు ఇష్టమని బ్రహ్మణి చెప్పింది. తన తండ్రి లాగా డైలాగ్స్ చెప్పడం దేశంలో ఎవరి వలన కాదని.. అలాంటి నటుడు దేశంలో ఒక్కడే ఉంటాడని.. బ్రహ్మణి తన తండ్రి బాలకృష్ణను ఆకాశానికి ఎత్తేసింది.. పర్సనల్ గా వీరసింహారెడ్డి తనకు చాలా నచ్చిందని.. నాన్న లుక్స్, మేనరిజం చాలా బాగున్నాయని.. ఈ సినిమాలో రాయలసీమ ప్రత్యేకతనం తెలియజేయడం నాకు చాలా నచ్చిందని అందులో నాన్నగారు చాలా అద్భుతంగా నటించారని బ్రాహ్మిని చెప్పుకొచ్చింది. ప్రతి సంక్రాంతికి నాన్నగారు ఎలాంటి కానుక ఇస్తారో.. ఈ సంక్రాంతికి కూడా మంచి కానుకను అందించారని బ్రహ్మణి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం బ్రాహ్మిణీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.