సరిగ్గా ఎన్నికలకు ముందు టీడీపీ బరిలో ఎన్టీఆర్.. క్లారిటీ ఇచ్చిన నారా బ్రాహ్మణి..!!

ఏపీలో వచ్చే ఎన్నికలను టీడీపీ నేతలు చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఒకపక్క చంద్రబాబు మరోపక్క నారా లోకేష్ నిత్యం ప్రజలలో ఉంటూ వైసీపీ ప్రభుత్వ తీరుపై తమదైన శైలిలో పోరాడుతూ వస్తున్నారు. లోకేష్ పాదయాత్ర ఇప్పటికే 2500 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడం జరిగింది. మరో నాలుగు నెలలలో ఈ పాదయాత్ర ముగియనుంది.

Nara Lokesh and Jr Ntr : బావ నుంచి పిలుపొచ్చింది.. అన్నింటికీ ఫుల్ క్లారిటీ కూడా వచ్చేసింది.. ఇక డిసైడ్ కావాల్సింది బాద్ షానే..! | Special Story On Nara Lokesh Welcomed ...

మరో పక్క చంద్రబాబు రకరకాల కార్యక్రమాలతో నిత్యం ప్రజలలో ఉంటూ వస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే తెలుగుదేశం పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ ని ఈసారి తీసుకొని ప్రచారంకి వెళ్లాలని టిడిపి శ్రేణులు నందమూరి అభిమానులు కోరుకుంటూ ఉన్నారు. అయితే సరిగ్గా ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ తరఫున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి రెడీ అవుతున్నట్లు తాజాగా నారా బ్రాహ్మణి అన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉంది. ఈసారి తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారానికి నందమూరి కుటుంబ సభ్యులంతా హాజరవుతున్నారని సమాచారం. దీంతో ఎన్టీఆర్ సైతం ప్రచారానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

నారా బ్రాహ్మణి ఈ విషయంలో ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఒప్పించినట్లు.. అప్పటికి తన కొత్త సినిమా “దేవర” షూటింగ్ కంప్లీట్ కానున్న క్రమంలో.. తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ఇప్పటికే చాలా సందర్భాలలో ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారానికి రావాలని అభిమానుల నుండి టిడిపి కార్యకర్తలు నుండి ఒత్తిడి వస్తూ ఉంది. ఏపీలో పార్టీ పరిస్థితి కూడా అంతంతమాత్రంగా ఉండటంతో ఎన్టీఆర్.. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 2009 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ తరఫున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఆ టైంలో రాజకీయంగా ఎన్టీఆర్ తనదైన శైలిలో తన ప్రసంగాలతో క్యాడర్ లో జోష్ నింపారు. కానీ ఆ సమయంలో తెలుగుదేశం ఓడిపోవడంతో తర్వాత రాజకీయంగా ఎన్టీఆర్ పెద్దగా యాక్టివ్ అవలేదు. యధావిధిగా మళ్లీ సినిమాలు చేసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ సంపాదించుకోవడంతో ఈసారి..టీడీపీ తరపున ఎన్టీఆర్ ప్రచారంలో పాల్గొన్నబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.