Breaking: చావు బ్రతుకుల మధ్య నందమూరి తారక రత్న..

Breaking: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం కుప్పంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. యువగళం పాదయాత్రలో స్పృహ‌త‌ప్పి పడిపోయారు.. ఆయన వాహనంపై నుంచి పడిపోయారు. తారకరత్నను వెంటనే కుప్పం కేసీ ఆస్పత్రికి తరలించారు.

Nandamuri taraka Ratna health condition critical on yuvagalam participation
Nandamuri taraka Ratna health condition critical on yuvagalam participation

నటుడు తారకరత్నకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. దాంతో వెంటనే ఆయన్ను కుప్పంలోని కేసీ ఆసుపత్రికి తరలించారు. కుప్పం సమీపాన ఉన్న లక్ష్మీపురం శ్రీవరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం లోకేష్ పాదయాత్ర స్టార్ అయింది.

 

అనంతరం కొద్దిదూరం నడిచిన తర్వాత మసీదులో లోకేశ్‌ ప్రార్థనలు చేశారు. ఈ సమయంలో లోకేశ్‌ పక్కనే ఉన్నారు తారకరత్న. మసీదు నుంచి బయటకు వచ్చే సమయంలో టీడీపీ కార్యకర్తలు, అభిమానుల పెద్ద ఎత్తున రావడంతో.. ఆ తాకిడికి తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో వెంటనే వాలంటీర్లు, టీడీపీ కార్యకర్తలు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. కాగా విషయం తెలిసిన వెంటనే నందమూరి బాలకృష్ణ ఆస్పత్రికి చేరుకున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

 

కేసీ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించిన అనంతరం.. మెరుగైన వైద్యం కోసం తారకరత్నను పీసీఎస్ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. కాగా సోషల్ మీడియాలో ఆయనకు ట్రీట్మెంట్ ఇస్తున్న వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు ఆ వీడియోలలో చూస్తుంటే అర్థమవుతుంది. నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలని ఆయన ఫ్యాన్స్ ప్రేక్షకులు అంతా కోరుకుంటున్నారు.