Namrata: మహేష్ బాబు భార్య నమ్రత తాజాగా ఓ జర్నలిస్ట్ తో స్పెషల్ చిట్ చాట్ చేసింది. నమ్రత తన పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.. నమ్రత తనకు వంట రాదని, వంట మనిషి ఉంటుందని తెలిపింది. ఆమ్లెట్, టీ, కాఫీ, మ్యాగీ వంటివి మాత్రమే నేను చేస్తానని.. అంతకు మించి వంటరాదని తెలిపింది. మహేష్ తమ పెళ్లి విషయంలో ఫుల్ క్లారిటీ ఉన్నారని.. పెళ్లి తరువాత నటించకూడదని ముందు చెప్పేసినట్టుగా నమ్రత తెలిపింది. మహేష్ తో పెళ్లి జరగడమే తనకు హ్యాపీయాస్ట్ మూమెంట్ అని నమ్రత వివరించింది. తల్లి, భార్యగా తన ధర్మాన్ని నిర్వర్తించేందుకే సినిమాలకు దూరంగా ఉన్నట్టు చెప్పుకొచ్చింది.

సితార అన్ వాటెండ్ బేబీ అని, ఒకవేళ సితార పుట్టి ఉండకపోతే.. మా జీవితాలు అసంపూర్ణంగానే ఉండేవని.. తన మా బంగారం అని నమ్రత తెలిపింది. గౌతమ్ పుట్టిన సమయంలో మేము అయితే ఎన్నో కష్టాలు పడ్డాను.. అసలు గౌతమ్ బతుకుతాడో లేదో అన్నట్టుగా వైద్యులు చెప్పారంటూ అప్పటి చేదు అనుభవాలు చెబుతూ బాధపడింది. ప్రతీ కుటుంబంలో కొన్ని కథలు, బాధలుంటాయి.. మాకు అదే ఇది అంటూ గౌతమ్ బర్త్ గురించి నమ్రత చెప్పింది. ఇక జీఎంబీ విషయంలోనూ నమ్రత కొన్ని కామెంట్లు చేసింది.