Namratha : మావగారు కృష్ణ పేరుతో కోడలు నమ్రత అతిపెద్ద ఆసుపత్రి .. బంగారం తల్లీ నువ్వు !

Namratha :  తెనాలికి నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉన్న బుర్రిపాలెం గ్రామంలో ఘట్టమనేని రాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ దంపతులకు ప్రథమ సంతానంగ‌ కృష్ణ జ‌న్మించారు. తెనాలిలోని డాక్టర్ సుందరరామయ్య హాస్పిటల్‌లో 1943 మే 31 మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు కృష్ణ జ‌న్మించిన‌ట్టు స‌మాచారం. శివరామకృష్ణమూర్తి ఆయ‌న అస‌లు పేరు కాగా, సినీ ప‌రిశ్ర‌మ‌కు కృష్ణ‌గా ప‌రిచ‌య‌మై తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. నిర్మాత‌ల హీరోగా కృష్ణ‌కి మంచి పేరు ఉంది. అయితే త‌న కెరీర్‌లో ఏ రోజు కూడా డ‌బ్బు గురించి ఆలోచించ‌కుండా వైవిధ్య‌మైన క‌థ‌ల‌ని ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ వ‌చ్చారు.

namrata-plans-hospital-with-the-name-of-krishna
namrata-plans-hospital-with-the-name-of-krishna

మంచి మ‌న‌స్సు..

నవంబ‌ర్ 15 తెల్ల‌వారుజామున కృష్ణ అకాల మ‌ర‌ణం చెందారు. ఆయ‌న మృతి ఎంతో మందిని క‌లిచి వేసింది. ముఖ్యంగా కుటుంబ స‌భ్యులు, అభిమానులు కృష్ణ మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. మ‌హేష్ బాబు అయితే తీవ్ర దుఃఖంలో ఉన్నాడు. ఇక మ‌హేష్ కొడుకు గౌత‌మ్, కూతురు సితార కూడా ఎంతో ఎమోష‌న‌ల్ అయ్యారు. తాత‌య్య త‌మ మ‌ధ్య లేర‌ని తెలిసి చాలా బాధ‌ప‌డ్డారు. ఇక న‌మ్ర‌త కూడా తండ్రి లాంటి మావ‌య్య క‌న్నుమూయ‌డంతో తీవ్ర విషాదంలో ఉంది. అంతే కాదు మావ‌గారు కృష్ణ పేరుతో అతి పెద్ద ఆసుప‌త్రి క‌ట్టించాల‌ని అనుకుంటుంద‌ట‌.

ద‌గ్గ‌రుండి న‌మ్ర‌త ఈ ఆసుప‌త్రి క‌ట్టించాల‌ని ప్లాన్ చేస్తుండ‌గా, ఈ విష‌యం తెలుసుకున్న ప్ర‌తి ఒక్కరు నువ్వు బంగారం త‌ల్లి అంటూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. న‌మ్ర‌త‌ని కృష్ణ త‌న క‌న్న కూతురి క‌న్నా ఎక్కువ‌గా చూసుకునే వాడు. పెళ్లి స‌మ‌యంలో ఆమెని నిరాకరించిన కృష్ణ రాను రాను ఆమెని క‌న్న కూతురి మాదిరిగానే చూసుకున్నార‌ట‌. అది మ‌ర‌చిపోని న‌మ్ర‌త ఇప్పుడు త‌న మావ‌య్య పేరు మీద ఆసుప‌త్రి క‌ట్టించ‌డంతో పాటు ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు కూడా చేయాల‌ని అనుకుంటుంద‌ట‌.