Nothing Phone : పేరుకే నథింగ్.. ఫీచర్స్ తెలిస్తే మైండ్ బ్లోయింగ్..!!

Nothing Phone : భారత మార్కెట్లోకి రోజురోజుకి సరికొత్త ఫీచర్లతో సరికొత్త మోడల్ స్మార్ట్ ఫోన్లు పుట్టుకొస్తున్న విషయం తెలిసిందే. ఇక అంతేకాదు రోజుకో బ్రాండ్ చొప్పున మార్కెట్లోకి అడుగుపెడుతూ తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి చాలామంది పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ టెక్ దిగ్గజం అయినటువంటి వన్ ప్లస్ నుండి సహ వ్యవస్థాపకుడు కార్ల్ పీ సరికొత్తగా ఒక కంపెనీని ఏర్పాటు చేసి అందులో నుండి మొట్టమొదటి నథింగ్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయడం జరిగింది. ఇక ఈ ఫోన్ చూడడానికి కంపెనీ పేరు నథింగ్ అయినా ఫీచర్స్ తెలిస్తే మాత్రం మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే..

ఇక డ్యూయల్ కెమెరా సెట్ అప్ తో పాటు క్వాల్కం స్నాప్ డ్రాగన్ 778 G ప్రాసెసర్ తో మీ స్మార్ట్ ఫోన్ పనిచేస్తుంది. ఇక దీనిపై ఆఫర్ కూడా ప్రకటించారు. హెచ్డిఎఫ్సి బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా ఎవరైతే కొనుగోలు చేస్తారో వారికి 2000 రూపాయల వరకు రాయితీ కూడా అందించడం జరుగుతుంది. మన భారత్లో ఈ స్మార్ట్ ఫోన్ మనకు 3 వేరియంట్ లలో లభిస్తుందని కార్ల్ పీ తెలిపాడు. 8జీబీ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్.. ధర విషయానికి వస్తే.. రూ.32,999. ఇక రెండవ రకం వేరియంట్..8జీబీ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర విషయానికి వస్తే.. రూ.35,999 . ఇక మూడవ రకం 12జీబీ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర విషయానికి వస్తే.. రూ.38,999 గా పేర్కొన్నారు.

Name is Nothing Phone mind blowing features
Name is Nothing Phone mind blowing features

ఇక 120 HZ OLED స్క్రీన్, వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో పాటు అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇందులో ఉంటాయి అని నథింగ్ వ్యవస్థాపకుడు కార్ల్ పీ స్పష్టం చేశాడు. గ్లిఫ్ ఇంటర్ పేస్ తో ఈ ఫోన్ ఉంటుంది అని ఇక రెండు కెమెరాలు విషయానికి వస్తే.. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి సపోర్ట్ చేసే 50 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరాతో పాటు మరో అల్ట్రా వైడ్ 50 ఎంపీ కెమెరా ఉన్నాయి. ఇక సెల్ఫీ కోసం 16 మెగాపిక్సల్ కెమెరా కూడా ఉంటుంది. 15 W వైర్లెస్ చార్జింగ్ తో పాటు 33 W చార్జింగ్ సపోర్ట్ కూడా చేయగలరు. ఇక బ్యాటరీ కెపాసిటీ విషయానికి వస్తే 4,500 mah బ్యాటరీ తో ఈ ఫోన్ మనకు లభిస్తుంది. 120 Hz రిఫ్రిజిరేట్ తో లభించేయి స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచల పొడవును కలిగి ఉంటుంది.