Samantha: ఏం మాయ చేసావే సినిమాలో కలిసి నటించిన సమంత నాగచైతన్య ఆ సినిమాతోనే ప్రేమలో పడ్డారు. సుదీర్ఘకాలం పాటు ప్రేమించుకుని మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఏమైందో తెలియదు కానీ పెళ్లయిన కొన్నాళ్లకే విడిపోయారు. సమంత నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత మయోసైటిస్ అని అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా తను నటించిన శాకుంతలం సినిమా ప్రమోషన్లలో భాగంగా సమంత తన ఆరోగ్యం బాగో లేకపోయినా ప్రమోషన్లలో పాల్గొనింది. ఈ నేపథ్యంలో సమంతా ఎయిర్పోర్ట్ లో కనిపించిన విజువల్స్ చూసి ఆమె ఫ్యాన్స్ ఎంతో బాధపడిపోయారు.

సమంత బక్క చిక్కిపోయి.. నీరసించిపోయి.. ముఖం లాగేసి చాలా దారుణంగా కనిపించింది అంటూ కామెంట్స్ చేశారు. ఇక సకుంతలం ప్రమోషన్ లో పాల్గొన్న సమంత బాగా వీక్ గా కనిపించారు. సమంత విజువల్స్ చూసిన నాగచైతన్య కూడా కన్నీళ్లు పెట్టుకున్నారట. ఒక భర్తగా కాకపోయినా తనని ఫ్రెండ్ గా తనను దగ్గర తీసుకొని.. తన హెల్త్ గురించి కేర్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారట. ఇక సమంత నాగచైతన్య మళ్ళీ కలుసుకొనున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..