నాగబాబు కూతురు కొణిదెల నిహారిక, జొన్నలగడ్డ చైతన్య విడాకులు తీసుకున్ననాటినుండి రకరకాల వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే వున్నాయి. కానీ ఆయా అంశాలపట్ల మెగా ఫామిలీలో ఏ ఒక్కరూ ఇప్పటి వరకు స్పందించక పోవడం కొసమెరుపు. ఐతే జూన్ 5వ తారీఖున నిహారిక తన భర్త చైతన్య నుండి విడాకులు తీసుకున్న విషయం అందరికీ విదితమే. తాజాగా ఈ వార్తకు మరో వార్తను జోడించారు మన నెటిజనం. ప్రముఖు సెలెబ్రిటీల భవిష్యతులను అంచనా వేసే వేణుస్వామి.. గతంలోనే నిహారిక జాతకం చెప్పాడంటూ కామెంట్లు పెడుతున్నారు. వీరిద్దరూ విడాకులు తీసుకుంటారని వేణుస్వామి ముందే చెప్పాడంటూ చెవులు కొరుక్కుంటున్నారు.
నిహారిక విడాకులకు ఆమె జాతకంలో ఉన్న దోషాలు కారణం అని, దీనివల్లే విడాకులు తీసుకునే పరిస్థితి వచ్చిందని, ఈ మెగా డాటర్ మళ్లీ వివాహం చేసుకున్నప్పటికీ మరలా విడాకులు తప్పవని వెనుస్వామి ఓ మీడియా వేదికగా ఆ సో కాల్డ్ సామి చెప్పాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆమెకి సంతానం కలగడం కూడా చాలా కష్టమని వేణుస్వామి చెప్పినట్లుగా నీహారిక గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పార్టీలు, వెకేషన్స్ అంటూ తరుచుగా నీహారిక స్నేహితులతో ఎంజాయ్ చేస్తుంటుందని, మొదటి నుంచి సినీ పరిశ్రమకు చెందిన అమ్మాయి కావడంతో సాంప్రదాయం, కట్టుబాట్లలో ఇమడలేకపోయింది అని మరికొందరు కామెంట్లు చేయడం కొసమెరుపు.
ఇకపోతే, గతంలో వేణుస్వామి సమంత – నాగచైతన్య కూడా విడాకులు తీసుకుంటారని ఆ సామి వారు చెప్పినట్టు గుర్తు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇపుడు నీహారిక కూడా విడాకులు తీసుకుంటారని ముందే చెప్పారని నెటిజన్లు అంటున్నారు. ఇక వేణుస్వామి సినీ సెలబ్రిటీల విషయంలో చెబుతున్న సంఘటనలన్నీ వాస్తవాలవుతుండటంతో పరిహారాల కోసం ఆయన్ను ఆశ్రయించేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. రష్మిక, నిధి అగర్వాల్ లాంటి హీరోయిన్లు దోష పరిహారానికి పూజలు చేయించుకుంటున్నట్టు తెలిపే వీడియోలు కూడా ఆమధ్య సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి విదితమే.
తాజాగా రామబాణం, ఖిలాడి సినిమాల్లో కథానాయికగా నటించిన డింపుల్ హయతి కూడా వేణుస్వామిచేత పూజలు చేయించుకున్న విషయం విదితమే. కాగా ఆమెకు పూజల చేసే సమయంలో వైన్ బాటిల్స్ పెట్టడం ఆ పూజలో భాగంగా చేర్చడంతో నెట్టింట్ హాట్ టాపిక్ గా మారింది. కాగా ఇంత ఖచ్చితంగా అందరి జాతకాలు అంచనా వేస్తున్న వేణుస్వామి తన కూతురి గురించి చెప్పిన విషయాలు నాగబాబుకి నిద్ర లేకుండా చేస్తున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘ఒక మనసు’ అనే రొమాంటిక్ సినిమాతో కెరీర్ ఆరంభించిన నిహారిక.. ఆ తర్వాత ముద్దపప్పు ఆవకాయ్, సూర్యకాంతం లాంటి సినిమాల్లో నటించి నటిగా మెప్పించింది. అయితే ఆయా సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో ఆమె కెరీర్ కి పెద్దగా ప్లస్ కాలేదు. దీంతో నటన పరంగా వెనుకడుగేసి నిర్మాతగా సత్తా చాటాలని ప్లాన్ చేస్తోంది నిహారిక.