ప్రియుడి మత్తులో కన్నబిడ్డలకు అన్యాయం చేస్తూ కానరాని లోకాలకు వెళ్లిపోయిన యువతి!

నేటి కాలంలో వివాహేతర సంబంధాలు అనేవి యావత్ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. అభం శుభం తెలియని కన్నబిడ్డలను అన్యాయం చేస్తున్నారు. అయితే దీనికి బాధ్యులు ఎవరు? అంత బాధ్యత లేకుండా బరితెగించిన వారికి పిల్లల్ని కనే హక్కు ఎవరు కల్పించారు? ఒకరి మరణం, మరొకరి జైలు జీవనంతో పిల్లల బతుకులు అయోమయంలో పడేస్తున్నారు. దానికి ఉదాహరణగా ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన జంట హత్యలు గురించి ఇక్కడ చెప్పుకోవచ్చు.

Advertisement

అవును, ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన జంట హత్యలు స్థానికంగానే కాకుండా రాష్ట్రమంతటా కలకలం సృష్టించాయి. వివాహేతర సంబంధమే ఈ హత్యలకు ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు. ఆదిలాబాద్ జిల్లా, గుడిహత్నూరు మండలంలోని సీతాగోంది శివారులో యువతీ, యువకుల ఛిద్రమైన మృతదేహాలు పోలీసులు గుర్తించారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించి వీరిని ఆదిలాబాద్‌లోని భుక్తాపూర్‌కు గ్రామ వాసులుగా గుర్తించారు.

అశ్విని‌‌, రమేష్​లకు 13ఏళ్ల క్రితం వివాహమైంది. అశ్వనికి 28 ఏళ్లు. పెళ్లయి ఇద్దరు పిల్లలతల్లి. భర్తతో విబేధాలు రావడంతో కొన్నాళ్లుగా పుట్టింట్లో ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకి 20 ఏళ్ల కుర్రాడితో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆ కుర్రాడి పేరు రెహమాన్‌. భార్య లేక ఒంటరిగా వున్న మహిళకావడంతో ఆమెపై కన్నేసిన రహమాన్ కొద్దిరోజుల్లోనే ఆమెతో సరససల్లాపాలు కొనసాగించాడు. ఆ విషయం ఆనోటా ఈనోటా విని తెలుసుకున్న రమేష్ వారిపైన ఓ కన్నువేసాడు.

Advertisement

ఈ క్రమంలో, రమేష్ ఆరోజు అత్తవారింటికి వెళ్లగా అశ్విని కనబడలేదు. దాంతో అక్కడేవున్న పిల్లలని అడగడంతో అమాయకులైన వారు తన తల్లి రోజూ ఎక్కడికి పోతుందోనన్న లొకేషన్ వివరాలు తండ్రికి చెప్పారు. దాంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న రమేష్… అశ్విని, రహమాన్ శృంగారాన్ని చూసి కోపంతో రగిలిపోయాడు. వెంటనే ఆ విషయాన్ని తన ఇద్దరు చెల్లెల్లు, బావతో ఫోన్లో మాట్లాడగా వారు అంతే స్పీడుగా ఆ లొకేషన్ కి చేరుకున్నారు. మాటుగా ఆ రంకు భాగోతాన్ని గమనించిన రమేష్ ఇక ఆలస్యం చేయకుండా అశ్విని, రెహమాన్ పైన విరుచుకు పడ్డాడు. తన ఇద్దరు చెల్లెల్లు, బావ కూడా అతగాడికి సహకరించడంతో నిముషాల వ్యవధిలో వారిని బండరాళ్లతో మోది హతమార్చారు.

తరువాత అక్కడ ఏమీ జరగనట్టు అక్కడినుండి జారుకున్నారు. అయితే ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యలు అశ్విని భర్త రమేష్​ చేసినట్టు తెలుసుకున్నారు. ఈ కేసులో రమేష్ A1 ముద్దాయిగా, మిగిలిన ముగ్గురు A2, A3, A4లుగా కటకటాల వెనక్కి వెళ్లారు. ఈ మొత్తం కధలో అభంశుభం తెలియని రమేష్, అశ్విని పిల్లలు మాత్రం అనాధలుగా మిగిలారు.

Advertisement