ముఖేష్ అంబానీ భార్య ఇచ్చిన పార్టీలో తాళుకుమన్న రజినీకాంత్..!!

సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమా విజయంతో ఫుల్ జోష్ మీద ఉన్నారు. ఈ సినిమా విడుదల ఈ వారం రోజులకు 500 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం జరిగింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన “జైలర్” సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా విజయంతో రజనీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. రజిని కెరియర్ లోనే అత్యంత హైయెస్ట్ కలెక్షన్స్ అతి తక్కువ టైంలో సాధిస్తున్న సినిమాగా జైలర్ దూసుకుపోతుంది.

ఈ సినిమాలో రజిని స్టైల్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచింది. ఇదిలా ఉంటే దేశంలో నాలుగు నెలల క్రితం ముఖేష్ అంబానీ భార్య నీతు అంబానీ సినిమా ఇండస్ట్రీకి చెందిన వారికి పార్టీ ఇవ్వటం జరిగింది. ముఖేష్ అంబానీ కల్చరల్ సెంట్రల్ లాంచ్ పేరిట జరిగిన ఈ కార్యక్రమంలో దేశంలో చాలామంది ప్రముఖ నటీనటులు హాజరయ్యారు. ఇక ఇదే వేడుకకు సూపర్ స్టార్ రజినీకాంత్ తన కూతురు ఐశ్వర్యతో హాజరయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వారి మధ్య రజిని కాంత్ చాలా సింపుల్ లుక్ లో హాజరయ్యారు. ఎటువంటి మేకప్ లేకుండా రజిని అందరి దృష్టిని ఆకర్షించే రీతిలో వీడియోలో కనిపిస్తున్నారు.