ప్రిన్స్ మహేష్ బాబు కోసం ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ హైదరాబాద్‌కి పయనమవ్వడం ఇప్పుడు చర్చినీయాంశంగా మారింది. ముకేశ్ అంబానీ మహేష్ బాబును ఎందుకు మీట్ అవుతున్నారనేది అధికారికంగా ఇంకా తెలియ రాలేదు. సినీ సర్కిల్‌లో జరుగుతున్న ప్రచారం ప్రకారం మహేష్ బాబుతో కలిసి అంబానీ భారీ బడ్జెట్ సినిమా నిర్మించేందుకు సిద్ధమయ్యారని సమాచారం. మహేష్ అంటే అంబానీ కుటుంబాల్లోని అందరికీ ఇష్టమేనని, అందుకే తమ నిర్మాణంలో మహేష్ సినిమాని తీయాలని సమిష్టిగా నిర్ణయించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగాలీ, హిందీ, తెలుగు, తమిళ సినిమాలను నిర్మించిన సంగతి తెలిసిందే. మహేష్ బాబుతో మాత్రం అంబానీ ప్రొడక్షన్ హౌస్ ఒక సినిమా కూడా తీయలేదు. తీస్తే భారీ హిట్ సొంతం చేసుకోవడంతో పాటు లాభాల పంట పండుతుందని అంబానీ తన బిజినెస్ మైండ్‌తో ఆలోచిస్తున్నట్లు టాక్. ముఖేష్ తలుచుకుంటే వేలకోట్లలో సినిమాని అద్భుతంగా నిర్మించగలడు. తలపండిన హాలీవుడ్ టెక్నీషియన్లను ఇండియాకి రప్పించగలడు. అద్భుతమైన కథను, దానిని గొప్ప మాస్టర్ పీస్‌గా మార్చగల దర్శకుడిని అంబానీ భరించగలడు.
అయితే మహేష్ బాబుది ఎంత పెద్ద ధనవంతుడు వచ్చి తనకు ఓపెన్ ఆఫర్ ఇచ్చినా వెంటనే ఒప్పుసుకునే మనస్తత్వం కాదు. అభిమానులు మెచ్చే సినిమా మాత్రమే మహేష్ బాబు చేస్తాడు. ఒకవేళ అంబానీ ప్రాజెక్టు మహేష్ బాబుకి నచ్చితే అతను సైన్ చేయవచ్చు. ప్రస్తుతానికైతే ఈ బడా సెలబ్రిటీల మధ్య మాటలు నడుస్తున్నాయనే దానిపై అధికారికంగా ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. త్వరలో ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.