YS Viveka Case : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు చుట్టు తిరుగుతున్నాయి. ఆదివారం ఉదయం పులివెందులలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు అరెస్టు చేయడం తెలిసిందే. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాదు సిబిఐ కార్యాలయంలో ఐదోసారి ఎంపీ అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కాబోతున్నారు. ఇదే సమయంలో మరో పక్క తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. వైయస్ భాస్కర రెడ్డి అరెస్టు పట్ల కొన్ని మీడియా సంస్థలు.. సానుభూతి క్రియేట్ అయ్యేలా వ్యవహరిస్తున్నాయని ఆరోపణలు చేశారు.

ఆ ప్రాంతంలో ఎంతో పేరుగాంచిన వైయస్ భాస్కర్ రెడ్డి కుటుంబం ఇంత దారుణానికి పాల్పడటానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది అన్నది నాకు మొదటి నుండి సందేహం అని కొత్త అనుమానాన్ని రఘురామకృష్ణరాజు వ్యక్తం చేశారు. వైయస్ భాస్కర రెడ్డి… వైయస్ భారతి కుటుంబానికి చాలా దగ్గర బంధువు. ఇక కడప ఎంపీ సిట్టింగ్ స్థానం కచ్చితంగా వాళ్లకే వస్తుంది. అయినా గాని వైయస్ వివేకానంద రెడ్డిని చంపించడం వెనకాల… ఒక పెద్ద ధనవంతుడు హస్తం ఉందని నాకు అనుమానం కలుగుతుంది. ఆ ధనవంతుడు ఎవరు..? ఆ దిశగా విచారణ కొనసాగుతుందా లేదా అన్నది.. రాబోయే రోజుల్లో తెలుస్తోంది అని రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇక ఈ కేసులో మొదటిలో ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి పేర్లు… తమ పార్టీ నేతలు ఆరోపించగా వాళ్ళు కోర్టుకు వెళ్లి తమపై విచారణ చేయాలని పోరాటంతో వెనక్కి తగ్గటం జరిగింది. కచ్చితంగా తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న.. వాళ్ల ఆదేశాల మేరకు అప్పట్లో ఈ హత్య జరిగినట్లు.. రఘురామకృష్ణరాజు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే నేడు మధ్యాహ్నం.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరు కాబోతున్నారు. దీంతో ఏం జరుగుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది. ఈనెల 30వ తారీకు లోపు ఈ కేసు విచారణ మొత్తం కంప్లీట్ కావాలని సుప్రీంకోర్టు..సీబీఐకి ఆదేశాలు జారీ చేయడంతో.. వైయస్ వివేకా హత్య కేసుల్లో వరుస పెట్టి అరెస్టులు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.