Movie Ticket Offer : హైదరాబాద్ ఓ మల్టీప్లెక్స్ సినిమా థియేటర్ రూపాయికే టికెట్ ఇస్తుంది. రూపాయికి ఏమి రాని రోజుల్లో అన్ని సౌకర్యాలు ఉన్న ఈ థియేటర్ మాత్రం సినిమా టికెట్ రూపాయికి ఆఫర్ ఇస్తుంది. మౌలాలిలో మూవీ మాక్స్ ఏఎంఆర్ పేరుతో ఓ కొత్త మల్టీప్లెక్స్ థియేటర్ ఏర్పాటయింది. డిసెంబర్ 15న గ్రాండ్ గా ఈ థియేటర్ ప్రారంభోత్సవం జరుగుతోంది.. ఈ థియేటర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆరోజు ఒక్క రూపాయికే సినిమా టికెట్స్ ఇస్తున్నారు..

డిసెంబర్ 15న మూవీ మాక్స్ థియేటర్ లో 11 సినిమాలు ప్రదర్శనకు ఉన్నాయి. తెలుగులో తెలుగుతో పాటు హిందీ చిత్రాలు కూడా ఉన్నాయి. మూవీ మాక్స్ ప్రారంభ ఆఫర్ కింద ఆరోజు అక్కడ ఒక్క రూపాయికే ఏ సినిమా అయినా చూడొచ్చు.. ఆన్లైన్లో కూడా ఈ టికెట్ టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. అమెజాన్, బుక్ మై షో లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
మూవీ మాక్స్ మల్టీప్లెక్స్ లో ప్రస్తుతం గుర్తుందా శీతాకాలం, చెప్పాలని ఉంది, హిట్టు 2, పంచతంత్రం, ఉంచాయి, కాంతారా, దృశ్యం 2, యశోద, మసూద, లవ్ టు డే, భేదియా సినిమా టికెట్లను రూపాయికే పొందవచ్చు. ఆన్లైన్ లోనూ రూపాయి కి టికెట్లు అందుబాటులో ఉండడంతో జనాలు ఎగబడుతున్నారు.