MOTOROLA:మోటోరోలా 200MP కెమెరా మొబైల్ భారత్ లో ఆ రోజు నుంచే..!

మోటోరోలా కంపెనీ త్వరలోనే మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశ పెట్టబోతోంది. అయితే ఇప్పటికే యూరప్ మార్కెట్లో కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది.. 200 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా తో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది. అంతే కాకుండా క్వాల్కం స్నాప్ డ్రాగన్ 8+ Gen 1 SoC ద్వారా శక్తిని పొందుతుంది. ఇక 125 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను కల్పిస్తుంది. ఇక 144 Hz రీఫ్రెష్ రేట్ తో 6.67 అంగుళాల ఫుల్ హెచ్డి pOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇక నోటిఫికేషన్ ఇన్కమింగ్ ఫోన్ కాల్ లేదా షెడ్యూల్ చేయబడిన అలారం గురించి వినియోగదారులకు తెలియజేయడానికి ఫీచర్లు కూడా కల్పించారు.

ఇక స్టోరేజ్ విషయానికి వస్తే.. మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా ఒకే ఒక స్టోరేజ్ వేరియంట్ లో లభిస్తోంది. 12GB ర్యామ్ + 256 GB స్టోరేజ్ వేరియంట్ తో లభించే ఈ స్మార్ట్ ఫోన్ యూరోపియన్ కరెన్సీ ప్రకారం EUR 899. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్ విలువ అక్షరాల రూ.72,150. నిర్ణయించబడింది. ఇక కలర్స్ విషయానికి వస్తే.. ఇంటర్ స్టెల్లార్ బ్లాక్, స్టార్ లైట్ వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. ఇక ఇప్పటికే బ్రెజిల్, యూరప్, అర్జెంటీనా వంటి దేశాలలో అమ్మకానికి వచ్చింది. ఇక రాబోయే వారాల్లో లాటిన్, మిడిల్ ఈస్ట్, అమెరికా, ఆసియా వంటి ఎంపిక చేసిన దేశాల మార్కెట్లలో విడుదల చేయబడుతుంది.

ఇండియాలో ఎప్పుడు లాంచ్ కాబోతోంది అనే విషయానికి వస్తే సెప్టెంబర్ 10వ తేదీన మధ్యాహ్నం 1:00 గంటకు భారతదేశంలో లాంచ్ అవుతోందని టిప్ స్టర్ తెలిపారు.. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో అమ్మకానికి వస్తుందని అందరూ భావిస్తున్నారు. ఇక ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే 200 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా తో పాటు 50 మెగాపిక్సల్ సెన్సార్ కూడా ఉంటుంది. ఇక 12 మెగా పిక్సెల్ టెలిఫోన్ లెన్స్ తో జత చేయబడింది. 4160 ఎంఏహెచ్ బ్యాటరీ ని సపోర్ట్ చేస్తుంది.