Motorola : మోటోరోలా ఫోన్ కేవలం రూ.599 కే.. ఆఫర్ పొందాలంటే ఇలా చేయండి..!!

Motorola : ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ తాజాగా బిగ్ బచత్ ధమాల్ సేల్ ను నిర్వహిస్తోంది. ఇక ఈ సేల్ లో భాగంగా ఎన్నో ఆఫర్లను అందిస్తూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువుల పై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇకపోతే బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్న వారికి ఈ సేల్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు. ఇక ఈ సేల్ లో మోటోరోలా G60 ఫోన్ పై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. అయితే ఈ ఆఫర్ ను పొందాలి అంటే మీరేం చేయాలో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

Advertisement

ఈ ఫోన్ మార్కెట్ ధర రూ.21,999.. ఇక ఫ్లిప్ కార్ట్ లో 31 శాతం తగ్గింపుతో ఈ ఫోన్ ను రూ. 7000 రూపాయల తగ్గింపుతో రూ.14,999 కే కొనుగోలు చేయవచ్చు. ఇంకా ఈ ఫోన్ పై వివిధ బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఎస్బిఐ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే తక్షణమే 10% తగ్గింపు కూడా లభిస్తుంది. అంతే కాదు ఈ ఫోన్ పై భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీరు కండిషన్ బాగా ఉన్న పాత ఫోన్ ను ఎక్స్చేంజ్ చేసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ పై రూ.14,400 వరకు తగ్గింపు కూడా అందుకోవచ్చు. ఇక మోడల్ , కండీషన్ ఆధారంగా మీకు లభించే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఆధారపడి ఉంటుంది.

Advertisement
Motorola phone only Rs.599 Do this to get the offer..!!
Motorola phone only Rs.599 Do this to get the offer..!!

ఇక మీరు ఎక్స్చేంజ్ చేయాలనుకున్న మీ స్మార్ట్ ఫోన్ పూర్తిగా కండిషన్లో ఉంటే మీరు మోటోరోలా G60 స్మార్ట్ ఫోన్ కేవలం రూ.599కే సొంతం చేసుకోవచ్చు.. ఇక ఈ ఫోన్లో 6GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ కెపాసిటీతో 6.78 అంగుళాలు ఫుల్ హెచ్డి డిస్ప్లే తో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది. కెమెరా విషయానికి వస్తే ప్రధాన కెమెరా 108 మెగాపిక్సల్.. మిగతా రెండు కెమెరాలు 8MP +2MP కెమెరాలు అమర్చబడి ఉంటాయి. ఇక సెల్ఫీ కోసం 32 ఎంపీ ఫ్రంట్ కెమెరాని కూడా అమర్చారు.120 HZ రిఫ్రెష్ రేటుతో , ఈ స్మార్ట్ ఫోన్ 6000ఎంఏ హెచ్ బ్యాటరీ ని కూడా కలిగి ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఆఫర్ కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఇక మీరు స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే మీ పాత ఫోన్ ని ఎక్స్చేంజ్ చేసి దీనిని సొంతం చేసుకోవచ్చు..

Advertisement